ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రారంభమై నెలకు పైగా గడిచింది. హమాస్‌పై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ గొప్ప విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైనికులు గాజా పార్లమెంటు భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రం కూడా బయటకు వచ్చింది. హమాస్ పార్లమెంట్ భవనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ప్రకటించారు. ఇజ్రాయెల్ సైనికులు తమ చేతుల్లో ఆయుధాలు, ఇజ్రాయెల్ జెండాతో పార్లమెంటులో కూర్చొని ఉన్న చిత్రాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ తమ అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎదురుగా ఖాళీ కుర్చీలు పడి ఉన్నాయి. గాజా సిటీలోని ఈ పార్లమెంట్ భవనం గత 16 ఏళ్లుగా హమాస్ ఆధీనంలో ఉంది.
గాజాపై హమాస్ పూర్తిగా నియంత్రణ కోల్పోయిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ పేర్కొన్నారు. గత 16 ఏళ్లుగా గాజాను హమాస్ ఆక్రమించింది. అయితే హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో హమాస్ యోధులు ఓడిపోయారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు హమాస్ ఉగ్రవాదులు ఇప్పుడు దక్షిణాది వైపు పరుగులు తీస్తున్నారని రక్షణ మంత్రి యోవ్ గాలంట్ చెప్పారు. పౌరులు హమాస్ స్థావరాలను కొల్లగొడుతున్నారని పేర్కొంది.
ఇజ్రాయెల్ దాడిలో హమాస్ తన ముఖ్యమైన స్థావరాలను కోల్పోయిందని, దీని కారణంగా గాజాలో హమాస్ పట్టు కోల్పోయి బలహీనపడిందని, గాజాపై నియంత్రణ కోల్పోయిందని రక్షణ మంత్రి యోవ్ గాలంట్ చెప్పారు. పార్లమెంటు భవనాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, గాజా మొత్తం త్వరలో ఇజ్రాయెల్ ఆధీనంలోకి రావచ్చని రక్షణ మంత్రి చెప్పారు. పార్లమెంట్ భవనాన్ని స్వాధీనం చేసుకోవడం వల్ల గాజా మొత్తాన్ని నియంత్రించడం సులభతరం అవుతుందన్నారు.
అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేసి యుద్ధానికి నంది పలికారు. ఈ దాడిలో 1200 మందికి పైగా మరణించగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ సమయంలో ఉగ్రవాదులు 240 మంది ఇజ్రాయెల్ పౌరులను కూడా బందీలుగా పట్టుకున్నారు, ఇందులో పిల్లలు కూడా ఉన్నారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ సైన్యం హమాస్ స్థానాలపై నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. హమాస్‌ను నాశనం చేసే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..