హమాస్ హఠాత్తుగా ఇజ్రాయిల్‌పై దాడి చేసి యుద్ధానికి బీజం వేసింది. తమపై జరిగిన దాడికి ప్రతీకార చర్యగా ఇజ్రాయిల్ కూడా హమాస్ స్థావరం గాజాపై విరుచుకు పడుతుంది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హమాస్ ఇద్దరు అమెరికన్లను విడుదల చేసింది. ఇందులో ఓ మహిళ, ఆమె కుమార్తె కూడా ఉన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ వీరిద్దరినీ బందీలుగా చేసుకుంది. హమాస్ విడుదల చేసిన అమెరికా తల్లి, కుమార్తె కూడా ఇజ్రాయెల్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. ఈ ఇద్దరు అమెరికన్లు. ప్రస్తుతం ఇజ్రాయిల్ అధికారుల వద్ద ఇజ్రాయిల్‌లో సురక్షితంగా ఉన్నారు. ఖతార్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వారిని విడుదల చేస్తున్నట్లు హమాస్ తెలిపింది.
తమ పౌరుల విడుదలను స్వాగతిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. అయితే ఈ యుద్ధంలో 10 మంది అమెరికన్ పౌరులు తప్పిపోయారు. వారిలో కొందరు హమాస్ వద్ద బందీలుగా ఉండి ఉండవచ్చని మాకు తెలుసన్నారు. హమాస్ వద్ద ఇప్పటికీ 200 మందికి పైగా బందీలున్నారని బ్లింకెన్ చెప్పారు. వీరిలో అనేక దేశాలకు చెందిన పురుషులు, మహిళలు, యువకులు, బాలికలు, వృద్ధులు ఉన్నారు.
హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ప్రతి అమెరికన్‌ని విడిపించే పని కొనసాగుతోందని బ్లింకెన్ చెప్పారు. గాజాలో చిక్కుకున్న అమెరికన్లను రక్షించేందుకు తమ పని కొనసాగుతోందన్నారు. తమకు ముఖ్యమైన సహాయం చేసిన ఖతార్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. బందీలను విడుదల చేసేందుకు ప్రతి నిమిషం అమెరికా కృషి చేస్తుందని తెలిపారు.
హమాస్ అదుపులో ఇంకా 200 మందికి పైగా బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ పౌరులతో పాటు, అనేక మంది విదేశీ పౌరులు కూడా బందీలుగా ఉన్నారు. ఐక్యరాజ్యసమితి, అమెరికా సహా పలు దేశాలు పౌరులను విడుదల చేయాలని హమాస్‌కు విజ్ఞప్తి చేశాయి. ఇరాన్ కూడా బందీలను విడుదల చేయాలని హమాస్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు పాలస్తీనా, గాజాలపై దాడులు ఆపాలని ఇరాన్.. ఇజ్రాయిల్‌కు విజ్ఞప్తి చేసింది.
#WATCH | US Secretary of State, Antony Blinken says "…The urgent work to free every single American, to free all other hostages, continues, as does our work to secure the safe passage out of Gaza for the Americans who are trapped there. In this particular instance, I want to… pic.twitter.com/dJK5I8Hhfr
— ANI (@ANI) October 20, 2023
ఇజ్రాయిల్, హమాస్ మధ్య గత 14 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇరువైపులా 5500 మందికి పైగా మరణించారు. ఇజ్రాయిల్‌లో 1400 మందికి పైగా మరణించగా, గాజాలో 3000 మందికి పైగా మరణించారు. అదే సమయంలో ఈ యుద్ధంలో 12,000 మందికి పైగా పాలస్తీనియన్లు గాయపడ్డారు. ఇజ్రాయిల్‌లో కూడా 4800 మందికి పైగా గాయపడ్డారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..