israel and palestine war: ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌పై రాకెట్ లాంచర్లతో దాడులకు పాల్పడగా.. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు చేస్తోంది. వరుస రాకెట్ లాంచర్లను వదులుతోంది. కాగా, పాలస్తీనా నగరంపై ఇజ్రాయెల్ రాకెట్ దాడి చేస్తుండగా.. అల్ జజీరా జర్నలిస్ట్ ఆ రాకెట్ దాడిని లైవ్ రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్ జజీరాకు చెందిన లేడీ రిపోర్టర్ ఒక భవనంపై నిలబడి యుద్ధ పరిస్ధితుల గురించి లైవ్ రిపోర్టింగ్ ఇస్తోంది. ఆ సమయంలో గజా నగరంపై ఇజ్రాయెల్ ప్రయోగించిన రాకెట్ లాంచర్ ఓ భవంతిపై పడింది. అది చూసి ఆమె షాక్ అయ్యారు. కొద్దిపాటి దూరంలోనే ఆ దాడి జరగగా.. తొలుత భయపడినా ఆ రిపోర్ట్ తన రిపోర్టింగ్‌ను అలాగే కంటిన్యూ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు.
కాగా, ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే.. ఇజ్రాయెల్, పాలస్తీనాలు మాత్రం బాంబులతో పరస్పరం యుద్ధానికి పాల్పడుతున్నాయి. కొద్ది రోజులుగా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య రాకెట్ లాంచర్ల దాడులు కొనసాగుతున్నాయి. పాలస్తీనా ఉగ్రవాద ముఠా హమాస్.. ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేసింది. హమాస్ ఇప్పటివరకు 1,500 రాకెట్లను ప్రయోగించిందని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే, ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. దీంతో పాలస్తీని చిగురుటాకులా వణికిపోతోంది. అనేక భవనాలు నేలకూలాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇప్పటి వరకు 65 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు తెలుస్తోంది. అలాగే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 11 మంది హమాస్ కమాండర్లు మరణించినట్లు తెలుస్తోంది.
Al Jazeera @AJEnglish journalist reports live as building hit by #Israel airstrike pic.twitter.com/sJxOmDgGba
— CGTN (@CGTNOfficial) May 13, 2021
Also read: