Imran Khan: అనూహ్య తీర్పుతో ఇమ్రాన్ ఖాన్‌ అరెస్ట్.. మూడేళ్ల జైలు శిక్ష, ఐదేళ్ల పాటు ఎన్నికల్లో నిషేధం.. వివరాలివే..

Imran Khan: తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ హైకోర్డ్ ఇమ్రాన్ ఖాన్‌ని దోషిగా నిర్ధారించి మూడేళ్ల జైలు శిక్ష, ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. అలాగే లక్ష రూపాయల(పాక్ కరెన్సీ) జరిమానా కూడా విధించింది. లక్ష రూపాయలను చెల్లించని పక్షంలో మరో 6 నెలలు అదనంగా జైలులో ఉండాల్సి ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌పై ఇస్లామాబాద్ కోర్డ్

Imran Khan: అనూహ్య తీర్పుతో ఇమ్రాన్ ఖాన్‌ అరెస్ట్.. మూడేళ్ల జైలు శిక్ష, ఐదేళ్ల పాటు ఎన్నికల్లో నిషేధం.. వివరాలివే..
Pakistan's Former PM Imran Khan

Updated on: Aug 05, 2023 | 2:36 PM

Imran Khan: పాకిస్టాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి ఇస్లామాబాద్ హైకోర్ట్‌లో భారీ షాక్ తగిలింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ మీద వచ్చిన అభియోగాలపై శనివారం విచారించిన ఇస్లామాబాద్ హైకోర్డ్ అయన్ను దోషిగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్‌కి మూడేళ్ల జైలు శిక్ష, ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. అలాగే లక్ష రూపాయల(పాక్ కరెన్సీ) జరిమానా కూడా విధించింది. లక్ష రూపాయలను చెల్లించని పక్షంలో మరో 6 నెలలు అదనంగా జైలులో ఉండాల్సి ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌పై ఇస్లామాబాద్ కోర్డ్ తీర్పునిచ్చింది. ఇలా అనూహ్య తీర్పును ప్రకటించిన కోర్టు వెంటనే ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేయాలంటూ వారెంట్ జారీ చేసింది.

ఈ మేరకు ఇస్లామాబాద్ ఐజీని ఆదేశించింది. దీంతో ఐజీ నేతృత్వంలోని పోలీసు బలగాలు జమాన్ పార్క్‌లోని ఇమ్రాన్ ఖాన్ నివాసానికి చేరుకుని, అక్కడే ఆయన్ను ఆరెస్ట్ చేశారని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. అయితే అనూహ్యంగ చోటు చేసుకున్న ఈ పరిణామాలపై ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఈ విధమైన తీర్పులతో చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారని ఘాటుగా స్పందించింది.

ఇవి కూడా చదవండి


కాగా, 2018 నుంచి 2022 మధ్యకాలంలో పాకిస్థాన్ దేశ ప్రధాన మంత్రిగా వ్యవహరించారు ఇమ్రాన్ ఖాన్. ఆ సమయంలో ఆయన విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆయా దేశాలకు చెందిన అగ్ర నాయకులు ఇమ్రాన్‌కు అధికారికంగానే ఎన్నో బహుమతులు ఇచ్చారు. అలాగే ఇమ్రాన్ కూడా పాకిస్థాన్‌కి వచ్చిన అనేక మంది విదేశీ నాయకులకు అధికారికంగా ఎన్నో బహుమతులు ఇచ్చారు. ఇలా అందిన బహుమతుల్లో దాదాపు రూ.6 కోట్ల విలువ చేసే గిఫ్ట్స్‌ని ఇమ్రాన్ తన వ్యక్తిగత అవసరాల కోసం విక్రయించేశారనే అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. ఇమ్రాన్ తన దేశానికి వచ్చినవారికే కాక ఇతర దేశాలుకు ఆయన వెళ్లినప్పుడు ఆయా దేశాల నాయకులకు బహుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం ఖజానాలోని డబ్బులతో ఎన్నో గిఫ్ట్స్ కొనుగులు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి ఇమ్రాన్ పాల్పడ్డారంటూ దాఖలు చేసిన ‘తోషాఖానా కేసు’లోనే ఆయనకు శనివారం జైలు శిక్ష, ఐదు సంవత్సరాల రాజకీయ నిషేధం పడ్డాయి. .