Nuclear Missiles: అణు క్షిపణుల ప్రదర్శనలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. వీడియో.
ఉత్తరకొరియా నియంత కిమ్ శక్తివంతమైన అణు క్షిపణులను ప్రదర్శించారు. తాజాగా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో జరిగిన సైనిక పరేడ్‌లో రష్యా, చైనా ప్రతినిధులతో కలిసి కిమ్ జొంగ్ ఉన్ వీటిని తిలకించారు. 1950–53 కొరియా యుద్ధానికి విరామం పలికి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్తరకొరియా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ..,
ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు, కిమ్ తాత పేరుతో ప్యాంగాంగ్‌లో ఉన్న కిమ్–2 సంగ్ స్క్వేర్‌లో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి లి హొంగ్‌జోంగ్‌లతో కలిసి ప్రదర్శనను కిమ్ వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. సైనిక కవాతు మధ్య యుద్ధ ట్యాంకులు, భారీ ఖండాంతర క్షిపణు ఐసీబీఎంలతో ఉన్న ట్రక్కులు కదులుతుండగా ముగ్గురూ చేతులు ఊపారు. అణు క్షిపణులతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన నిఘా, అటాక్ డ్రోన్లను కూడా ప్రదర్శించారు. ఈ ఐసీబీఎంలన్నీ రష్యా డిజైన్ల ఆధారంగా తయారైనవేనని విశ్లేషకులు అంటున్నారు. దౌత్యపరంగా ఉత్తర కొరియాకు కీలక భాగస్వామి చైనా. వాణిజ్యానికి సంబంధించి కూడా ముఖ్యమైన మిత్ర దేశం చైనా. కేవలం 2018లోనే కిమ్ మూడుసార్లు చైనాలో పర్యటించారు. ఇక ఆర్థికపరంగా రష్యానే కాదు చైనా ఎంతో ప్రాధాన్యత ఉన్న దేశమని ప్రస్తుతం కిమ్ సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...