ఏంట్రా ఇది.. మహిళా ఎంపీ ఇంట్లో ‘మేలిమి బంగారు లో దుస్తులు’.. ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలు..!

లంచాలు తీసుకోవడం, ఆస్తులు వెనకేసుకోవడం అంతటా చూసేదే..! కానీ, రేంజ్‌లోనా? ప్రపంచమే ముక్కున వేలేసుకునే షాకింగ్ సీన్స్‌ ఇరాక్‌లో వెలుగు చూస్తున్నాయి. గుట్టల కొద్దీ నోట్ల కట్టలు.. వందల కేజీల బంగారం.. ఖరీదైన వస్తువులు.. విలాసానికి కూడా ఒక హద్దు ఉంటుందనుకుంటే... దాన్నే దాటేశారేమో అనిపిస్తోంది. ఆఖరికి వేసుకునే లో దుస్తులు కూడా నిలువెల్లా బంగారమే అంటే, అక్కడ దోపిడీ ఏ రేంజ్‌లో జరిగిందో ఒక్కసారి మీరే ఊహించుకోండి.! ఇదంతా బయటపడింది దొంగల ఇళ్లలో కాదు… ఆ దేశ ప్రజాప్రతినిధుల ఇళ్లలో!

ఏంట్రా ఇది.. మహిళా ఎంపీ ఇంట్లో ‘మేలిమి బంగారు లో దుస్తులు’.. ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలు..!
Anti Corruption Crackdown

Updated on: Jul 02, 2026 | 10:05 AM

లంచాలు తీసుకోవడం, ఆస్తులు వెనకేసుకోవడం అంతటా చూసేదే..! కానీ, రేంజ్‌లోనా? ప్రపంచమే ముక్కున వేలేసుకునే షాకింగ్ సీన్స్‌ ఇరాక్‌లో వెలుగు చూస్తున్నాయి. గుట్టల కొద్దీ నోట్ల కట్టలు.. వందల కేజీల బంగారం.. ఖరీదైన వస్తువులు.. విలాసానికి కూడా ఒక హద్దు ఉంటుందనుకుంటే… దాన్నే దాటేశారేమో అనిపిస్తోంది. ఆఖరికి వేసుకునే లో దుస్తులు కూడా నిలువెల్లా బంగారమే అంటే, అక్కడ దోపిడీ ఏ రేంజ్‌లో జరిగిందో ఒక్కసారి మీరే ఊహించుకోండి.! ఇదంతా బయటపడింది దొంగల ఇళ్లలో కాదు… ఆ దేశ ప్రజాప్రతినిధుల ఇళ్లలో!

ఇరాక్‌లో కూరుకుపోయిన అవినీతిపై అక్కడి ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆపరేషన్ డాన్ క్రాక్‌డౌన్ పేరుతో జరిగిన భారీ దాడుల్లో సిట్టింగ్ ఎంపీలు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు జరిగాయి. లీడర్ల ఇళ్లలో దొరికిన మిలియన్ల కొద్దీ డాలర్లు, గుట్టలుగా పడి ఉన్న బంగారం, కళ్లు చెదిరే విలాసవంతమైన వస్తువులు చూసి యావత్ ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది! ఈ దాడుల్లో 27 వందల కోట్ల నగదు, వందల కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 67 మందికి పైగా అవినీతి అధికారులు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులను అరెస్ట్‌ చేశారు.

ఈ దాడుల్లో వెలుగు చూసిన కొన్ని నమ్మలేని నిజాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి! మహిళా ఎంపీ హింద్ అల్-అబ్బాసి ఇంట్లో అధికారులు జరిపిన సోదాల్లో ఏకంగా రూ.475 కోట్ల నగదుతో పాటు, స్వచ్ఛమైన బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. అంతేకాదు ఆమె ఇంట్లో ఏకంగా ‘బంగారంతో తయారు చేసిన లో దుస్తులు’ లభించాయంటూ కొన్ని ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆ ఎంపీపై, అక్కడి రాజకీయ వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఎంపీ ఆలియా నాసిఫ్, ఆమె కుమారుడిని అరెస్టు చేసిన అధికారులు… వారి నివాసం నుండి సుమారు 15.5 మిలియన్ల అమెరికన్ డాలర్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ బిగ్‌ ఆపరేషన్‌ సాధారణ పోలీసుల వల్ల కాదని.. ప్రభుత్వం వ్యూహాత్మకంగా దేశంలోని అత్యున్నత రక్షణ విభాగమైన కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ ను రంగంలోకి దించింది. అరెస్ట్ కాబోతున్న వారు అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నేతలు కావడంతో వారు సాధారణ పోలీసులపై దాడులకు దిగే అవకాశం, లంచాలు ఇచ్చి తప్పించుకునే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం దేశంలోని అత్యున్నత రక్షణ విభాగమైన కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ ను రంగంలోకి దించింది. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఇరాక్ లాంటి దేశంలో నేతలు మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారాన్ని ఇళ్లలో కుప్పలుగా దాచుకోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us