అమెరికా రగిల్చిన చిచ్చు..! ఆయిల్‌ కోసం సాగుతున్న యుద్ధంతో ప్రపంచం ఆగమాగం..

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు 18 శాతం పెరిగాయని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. వస్తువుల ధరలు పెరగడం వల్ల 'పర్చేజింగ్ పవర్' పడిపోతుందనే హెచ్చరిలు వినిపిస్తున్నాయి. ఇది మార్కెట్లో డిమాండ్‌ను తగ్గించి, ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం వైపు నెడుతుందని చెబుతున్నారు. ఇరాన్ చెప్పినట్టు యుద్ధం సుదీర్ఘకాలం నడిస్తే.. వ్యాపార రంగాలు కూడా తలకిందులు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

అమెరికా రగిల్చిన చిచ్చు..! ఆయిల్‌ కోసం సాగుతున్న యుద్ధంతో ప్రపంచం ఆగమాగం..
Iran war strategy analysis

Edited By:

Updated on: Mar 14, 2026 | 9:15 AM

‘ఇరాన్‌తో అంత ఈజీ కాదు’ అనుకునేలా ఉండాలని ముందే యుద్ధవ్యూహాన్ని డిజైన్ చేసి పెట్టుకుంది ఇరాన్. దీన్నో ‘ర్యాపిడ్ వార్’గా ముగించేయొచ్చనుకున్నారు ట్రంప్. సుప్రీం లీడర్‌ చనిపోయినా.. ఒకేసారి 40 మంది డిఫెన్స్ కమాండర్స్‌ను హతమార్చినా.. యుద్ధం రెండో వారంలోకి వచ్చిందంటేనే అమెరికా ప్లాన్-ఏ ఫెయిల్ అయిందని మీనింగ్. ప్రపంచానికి ఈ విషయం ఎప్పుడో అర్ధమైంది.. ఒక్క ట్రంప్‌కు తప్ప. సో, అల్టిమేట్‌గా ఇరాన్ ప్లాన్ ఒక్కటే. అంతటి అమెరికానే యుద్ధానికి దిగినప్పుడు ఓటమి తప్పదని తెలుసు. కాని, తన ఓటమి ప్రత్యర్థికి గుర్తుండిపోయేలా చేయాలనుకుంటోంది. చేస్తోంది కూడా. అమెరికా ఆయుధాగారం ఖాళీ అవుతోంది. ఆర్థిక విపత్తు రాబోతోంది. ఇరాన్ స్ట్రాటజీ వల్లే.. భారత్‌లో వంట గ్యాస్ ధర పెరిగింది. పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ 350 రూపాయలైంది. త్వరలో దేశంలో యూరియా కొరత వచ్చినా రావొచ్చు. అంతటితోనే అయిపోదు. సంపన్నుల నుంచి సామాన్యుల వరకు.. స్టాక్‌మార్కెట్ నుంచి సేవింగ్స్ వరకు అన్నిటిపైనా ఇంపాక్ట్ తప్పదు. దీనంతటికీ కారణం.. ట్రంప్ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం. పక్కిళ్లు తగలబడుతుంటే తన ఇంటికి నీళ్లు చల్లుకున్నాడట. ఇది విని నవ్వుకుంటాం గానీ, ఇప్పుడదే పరిస్థితి ఉంది. ఓ ఉదాహరణ చెప్పుకుందాం. బంగ్లాదేశ్‌నే ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. అక్కడ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి