European parliament: పార్లమెంట్‌లో డ్యాన్స్ ప్రదర్శన.. వైరల్ అవుతున్న వీడియో.. ప్రజల రియాక్షన్ ఇదీ..!

|

May 12, 2022 | 6:20 AM

European parliament: ఈయూ పార్లమెంటులో డాన్సులు విమర్శలకు దారి తీశాయి.. ఇదేం తీరని ఫ్రాన్స్‌ అధ్యక్షునితో పాటు సోషల్‌ మీడియాలో పలువురు మండిపడ్డారు.

European parliament: పార్లమెంట్‌లో డ్యాన్స్ ప్రదర్శన.. వైరల్ అవుతున్న వీడియో.. ప్రజల రియాక్షన్ ఇదీ..!
Dance
Follow us on

European parliament: ఈయూ పార్లమెంటులో డాన్సులు విమర్శలకు దారి తీశాయి.. ఇదేం తీరని ఫ్రాన్స్‌ అధ్యక్షునితో పాటు సోషల్‌ మీడియాలో పలువురు మండిపడ్డారు. అవును.. యూరోపియన్ పార్లమెంటులో వాగ్వాదాలు, నిరసనలు, అప్పుడప్పుడూ ఫైటింగులే చూశాం. కానీ ఈ డాన్సులేమిటని అందరూ మండిపడుతున్నారు. యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంటులో ఈ విచిత్రం చోటు చేసుకుంది. ఈయూ భవిష్యత్తుపై చర్చ అటూ ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంటులో మేథోమధనం నిర్వహించారు.. యూరోప్‌ దేశాల అభివృద్ది కోసం సలహాలు సూచనలు స్వీకరించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం.. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ సమావేశం మరి కొద్ది సేపట్లో ముగస్తుందనగా పార్లమెంటులోకి కొందరు డాన్సర్లు ప్రవేశించారు. వీరంతా ఉత్సాహంగా డాన్సులు చేస్తూ ఉర్రూతలూగించే ప్రయత్నం చేశారు.. వీరి సంబరం ఏమిటోగానీ అక్కడ ఉన్న చాలా మంది ఈయూ పార్లమెంట్‌ సభ్యులకు ఇది చిరాకు తెప్పించింది.

ముఖ్యంగా ఈ డ్యాన్సులపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అసహనం వ్యక్తం చేశారు. ఆయన కీలక ప్రసంగం చేసే ముందు బ్రేక్‌ సమయంలో ఈ డాన్సులు మొదలయ్యాయి.. ఈ డాన్సులు సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి.. యూరోప్‌ భవిష్యతు అంటూ ఈ డాన్సులేనా? ఇదే నిజమైతే మీ అందరికీ ఇబ్బందులు తప్పవని కొందరు ఘాటుగా విమర్శలు గుప్పించారు.. ఈ దరిద్రం చూడటానికేనా మేం పన్నులు చెల్లిస్తున్నది అంటూ మరికొందన్నారు.. ఈయూతో బ్రేకప్‌ అయిందుకు తమకు సంతోషంగా ఉందంటూ బ్రిటన్‌కు చెందిన నెటిజన్లు వ్యంగ్యోక్తులు విసిరారు.. ఉక్రెయిన్‌ యుద్ద సమయంలో ఈ సంతోషం ఏమిటో అంటూ పలువురు వ్యాఖ్యానించారు.