ఈ గుడికి వెళితే.. విడాకులు గ్యారెంటీ..!

సాధారణంగా గుడికి జనం మంచి జీవిత భాగస్వామి రావాలని.. లేదా మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటారు. ఇంకా చెప్పాలంటే తమ బంధం నూరేళ్లు చక్కగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ జపాన్ లోని ఓ దేవాలయానికి మాత్రం భర్తతో విడాకులు ఇప్పించమని, బంధాల నుంచి విముక్తి చేయమని కోరుకోవడానికి మాత్రమే వెళతారట జనం. ఎందుకంటే ఆ ఆలయం బంధాలను తెంచడంలో ప్రసిద్ధి చెందిందట. ‘యాసుయ్ కోన్పేగు’ అనే ఈ దేవాలయం జపాన్ లోని హిగాషియమ జిల్లాలోని క్యోటో నగరంలో […]

  • Ravi Kiran
  • Publish Date - 4:06 pm, Sat, 16 March 19
ఈ గుడికి వెళితే.. విడాకులు గ్యారెంటీ..!

సాధారణంగా గుడికి జనం మంచి జీవిత భాగస్వామి రావాలని.. లేదా మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటారు. ఇంకా చెప్పాలంటే తమ బంధం నూరేళ్లు చక్కగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ జపాన్ లోని ఓ దేవాలయానికి మాత్రం భర్తతో విడాకులు ఇప్పించమని, బంధాల నుంచి విముక్తి చేయమని కోరుకోవడానికి మాత్రమే వెళతారట జనం. ఎందుకంటే ఆ ఆలయం బంధాలను తెంచడంలో ప్రసిద్ధి చెందిందట. ‘యాసుయ్ కోన్పేగు’ అనే ఈ దేవాలయం జపాన్ లోని హిగాషియమ జిల్లాలోని క్యోటో నగరంలో ఉంది.

ఇక ఆలయంలోని పెద్ద బండరాయికి… వద్దనుకుంటున్న బంధం వివరాలు రాసి కడితే వారి కోరికలు తీరుతుందని అక్కడ ఉన్న స్థానికుల నమ్మకం.