Gold Island: ఫలించిన ఐదేళ్ల అన్వేషణ.. మత్స్యకారులకు దొరికిన లక్షల కోట్ల విలువజేసే బంగారు ద్వీపం.. ఎక్కడంటే…

|

Oct 31, 2021 | 2:44 PM

Gold Island: గుప్తనిధుల కోసం అన్వేషణ గురించి ప్రతిరోజూ వార్తలు వింటూ ఉంటాం. అయితే లక్షల కోట్లు విలువజేసే  నిధులు బయటపడినట్లు వినలేదు..

Gold Island: ఫలించిన ఐదేళ్ల అన్వేషణ.. మత్స్యకారులకు దొరికిన లక్షల కోట్ల విలువజేసే బంగారు ద్వీపం.. ఎక్కడంటే...
Island Of Gold
Follow us on

Gold Island: గుప్తనిధుల కోసం అన్వేషణ గురించి ప్రతిరోజూ వార్తలు వింటూ ఉంటాం. అయితే లక్షల కోట్లు విలువజేసే  నిధులు బయటపడినట్లు వినలేదు.. చూడలేదు… సాధారణంగా గుప్త నిధుల వేట గురించి జానపద కథల్లో, సినిమాల్లో చూస్తాం. కానీ చాలా అరుదుగా మాత్రమే నిజజీవితంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. అలాంటిదే జరిగింది ఇక్కడ. ఇండోనేషియా మత్స్యకారులకు తాజాగా ఓ వెలకట్టలేని నిధి దొరికింది… వివరాల్లోకి వెళ్తే..

ఇండోనేషియా సుమత్రాద్వీపంలోని పాలెంబాంగ్ సమీపంలో ఉన్న మూసీ నదిలో మొసళ్లు ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తాయి. ఇటువంటి ప్రమాదకర నదిలో గత ఐదేళ్లుగా బంగారు ద్వీపం కోసం వెదుకుతున్నారు అక్కడి మత్సకారులు. ఈ సుమత్రా దీవికి బంగారం ద్వీపం అనేపేరు కూడా ఉంది. అక్కడి ఇతిహాసాలు ఇటువంటి ఒక గుప్త నిధికి సంబంధించిన దీవి ఉన్నట్లు చెబుతున్నాయట. ఐతే ఇది కథకాదని నిజమని రుజువుచేసే విధంగా విలువైన రత్నాలు, నాణెలు, బంగారు ఉత్సవ ఉంగరాలు, కాంస్య గంటలు.. వంటి అరుదైన సంపదతో నిండిన ద్వీపాన్ని నిధిరూపంలో మత్స్యకారులు కనుగొన్నారు. అంతేకాకుండా 8వ శతాబ్దానికి చెందిన రత్నాలతో అలంకరించబడిన బుద్ధుని విగ్రహం కూడా ఈ నిధిలో బయటపడింది. దీని విలువ మిలియన్ల పౌండ్లు ఉంటుందట. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కనుగొనబడిన అత్యంత విలువైన నిధుల్లో ఇది ఒకటని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు.

Voice : ‘ది గార్డియన్‌’ అనే బ్రిటీష్‌ డైలీ న్యూస్‌ పేపర్‌ నివేదిక ప్రకారం ఈ గుప్త నిధి శ్రీవిజయ నాగరికతకు సంబంధించినదిగా తెలుస్తోంది. క్రీ.శ. 7 నుంచి 13వ శతాబ్ధం వరకు ఎంతో వైభవంగా విలసిల్లిన శ్రీ విజయ సామ్రాజ్యం హఠాత్తుగా కనుమరుగైపోయింది. కారణాలు ఇప్పటి వరకూ ఎవ్వరికీ తెలియరాలేదు. ఈ సామ్రాజ్యం ఒకప్పుడు ‘వాటర్ వరల్డ్’ గా ప్రసిద్ధిగాంచిందట. కేవలం చెక్కపడవలపై ఇళ్ళు, రాజభవనాలు, దేవాలయాలు నిర్మించారట. ఈ నాగరికత అంతరించినప్పుడు ఈ నిర్మాణాలన్నీ నీళ్లలో మునిగిపోయాయట. ఈ నాగరికత ఆవిష్కరణ గురించి తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, కానీ ఇప్పటికీ విజయవంతం కాలేదు. ఐతే గత ఐదేళ్లలో అసాధారణ విషయాలు తెరపైకి వస్తున్నాయి. అన్ని కాలాలకు చెందిన నాణేలు, బంగారం, బౌద్ధ శిల్పాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. శ్రీవిజయరాజ్యం కల్పితం కాదనడానికి ఆధారాలుగా చెబుతున్నారు. శ్రీవిజయ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది అనేదానికి ఎవరి దగ్గర ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇండోనేషియా అగ్నిపర్వతాలవల్ల గానీ లేదా వరదల కారణంగా గానీ ఈ సామ్రాజ్యం కూలిపోయి ఉండవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read: ఈ నెలల్లో వచ్చే ముఖ్యమైన పండగ వివరాలు.. విశిష్టత

సీనియర్ నటుడు కైకాలకు స్వల్ప అస్వస్థత.. చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిక