Indonesia Palm Oil Vehicles: పామాయిల్ వంటల్లోకే కాదు.. వాహనాల్లో ఇంధనంగా పని కొస్తుందంటున్నారు ఇండోనేషియన్లు.. అక్కడి వాహనాలపై ప్రయోగాలు జరుపుతున్నారు.. రోజురోజుకీ ఇంధన ధరలు పెరిగిపోవడం ఆ దేశ ఖజానాకు భారంగా మారుతుండటంతో ఇండోనేషియా ఈ ప్రయోగానికి సన్నాహాలు చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ నూనె తయారు చేస్తున్న దేశం ఇండోనేషియా.. అయిల్ పామ్ తోటలు అక్కడ పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఇండోనేషియన్ల ఉపాధి, దేశ ఆదాయంలో పామాయిల్ ఎగుమతుల ద్వారా వచ్చే వాటాయే అధికం. అదే సమయంలో ఆ దేశం పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ల అవసరాల కోసం విదేశాల నుంచి పెద్ద మొత్తంలో ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. రోజు రోజుకీ ఇంధన ధరలు పెరిగిపోవడం ఆ దేశ ఖజానాకు భారంగా మారుతోంది. ఈ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడం ఎలా అనే ప్రశ్నకు తమ దేశంలోని పామాయిలే తగిన పరిష్కారాన్ని చూపించింది. చాలా దేశాల్లో డీజిల్‌లకు ప్రత్యామ్నాయంగా బయోడీజిల్ ఉపయోగిస్తున్నారు. బయోడీజిల్ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు వాహనాల ఇంజన్ సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. దీంతో వాహనాల మైలేజీ కూడా పెరుగుతుంది.
అయితే పామాయిల్‌ను బయోడీజిల్‌గా ఉపయోగించుకోవాని ఇండోనేషియా నిర్ణయించింది. అన్ని డీజిల్స్‌లో 30 నుంచి 40 శాతం వరకూ పామాయిల్ కలపాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికీ కొన్ని ప్యాసింజర్, కమర్షియల్ రవాణా వాహనాలపై ఈ ప్రయోగాన్ని అమలు చేసి ఫలితాలను పరీక్షిస్తోంది. ఈ మేరకు బుధవారం బయోడీజిల్ వాహనాలను పరీక్షించడం ప్రారంభించింది. బయోడీజిల్‌గా పామాయిల్‌ను ఉపయోగించడం ద్వారా ఇంధన దిగుమతుల భారం తగ్గుతుందని ఇండోనేషియా ప్రభుత్వం చెబుతోంది. అయితే పామాయిల్ కారణంగా తమ ఇంజన్లు దెబ్బతింటాయని వాహనదారులు భయపడుతున్నారు.
అయితే.. పామాయిల్‌తో నడిచే వాహనాలు ప్రజల రవాణాకు ఎంతమేరకు ఉపయోగపడతాయో ఈ సంవత్సరం చివరిలోగా తేల్చాలని అధికారులను ఆదేశించినట్లు ఇంధన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.
Indonesia launched road tests for two types of biodiesel containing 40% palm oil, hoping to conclude by the end of the year whether they are viable for public use https://t.co/OmSBHtHWpq pic.twitter.com/OacOPfZUdn
— Reuters (@Reuters) July 28, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..