భారతీయ నావికులతో వెళ్తున్న నౌకను హైజాక్ చేసిన సోమాలియా పైరేట్స్

సోమాలియా తీరంలో సముద్రపు దొంగలు రెచ్చిపోయారు. ఆరుగురు భారతీయ నావికులతో వెళుతోన్న కార్గో నౌకను హైజాక్ చేసారు. ఆఫ్రికన్ దేశమైన కామెరూన్ జెండాతో ఆ నౌక ప్రయాణిస్తోంది. టర్కీకి ఆయుధాలతో పాటు కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలను 'లుటుఫ్' కార్గో నౌక తీసుకెళుతోంది.

భారతీయ నావికులతో వెళ్తున్న నౌకను హైజాక్  చేసిన సోమాలియా పైరేట్స్
Somali Pirates Kidnap Indian Sailors

Updated on: Aug 21, 2026 | 4:09 PM

సోమాలియా తీరంలో సముద్రపు దొంగలు రెచ్చిపోయారు. ఆరుగురు భారతీయ నావికులతో వెళుతోన్న కార్గో నౌకను హైజాక్ చేసారు. టర్కీ సైనిక శిక్షణా కేంద్రానికి తరలించడానికి నౌకలో ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలను తీసుకెళుతున్నారు.  హైజాక్‌కు గురైన నౌకలో ఆరుగురు భారతీయ సముద్ర నావికులతో పాటు ఒక టర్కీ పౌరుడు, ఒక జార్జియా పౌరుడు ఇద్దరు సెర్బియా సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. గత ఏప్రిల్ 26వ తేదీన ఒక వ్యాపార నౌకను హైజాక్ చేసిన పైరేట్స్ బృందమే ఈ దాడులు చేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఘటనపై భారత ప్రభుత్వం కానీ టర్కీ అధికార వర్గాలు కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

నౌక అపహరణకు గురైన విషయం తెలిసిన వెంటనే ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. టర్కీకి చెందిన రెండు నౌకలు హైజాక్ అయిన నౌక దగ్గరికొచ్చాయి. టర్కీ హెలికాప్టర్లు, డ్రోన్లు ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించాయి. ఈ క్రమంలో ఒక చిన్న పడవలో ఇద్దరు వ్యక్తులు వచ్చి, సోమాలియాలో ఎక్కువగా ఉపయోగించే ‘ఖత్’ అనే పదార్థాన్ని నౌకలోని వారికి అందించినట్లు తెలిసింది.  ఆ పదార్థాన్ని తీసుకున్న వాళ్లు పడుకోకుండా చురుగ్గా ఉంటారు.

ఆ పడవ తిరిగి తీరానికి చేరుకున్న కొద్దిసేపటికే  వైమానిక దాడి జరిగింది. దాడిలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడులకు పాల్పడింది ఎవరు? మరణించిన వారు హైజాక్‌లో పాల్గొన్న పైరేట్లేనా? అనే విషయాలు ఇంకా స్పష్టం కాలేదు. ‘లుటుఫ్’ నౌక పరిస్థితి, అందులోని భారతీయ నావికులతో సహా ఇతర సిబ్బంది భద్రతకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సోమాలియా: మిలీషియా ఉగ్రరూపం… కాల్పుల్లో నలుగురు బలి

 

సోమాలియాలో మళ్లీ హింసాత్మక జ్వాలలు ఎగసిపడ్డాయి. ‘బైడోవా’ నగరంలో సోమాలియా ప్రభుత్వ దళాలకు, ఆయుధాలు చేపట్టిన మిలీషియా తిరుగుబాటుదారులకు మధ్య కాల్పులు జరిగాయి. రెండు వైపుల నుంచి దూసుకొచ్చిన బుల్లెట్లు నలుగురు అమాయక ప్రాణాలను బలితీసుకున్నాయి. బైడోవా నగరంపై సోమవారం తెల్లవారుజామునే తిరుగుబాటుదారులు విరుచుకుపడ్డారు. ఊహించని మెరుపు దాడితో నగరం యుద్ధరంగాన్ని తలపించింది. పరస్పర కాల్పుల్లో భద్రతా దళాలు 30 మంది మిలీషియా తిరుగుబాటుదారులను మట్టుబెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, ప్రభుత్వ దళాలకు జరిగిన ప్రాణనష్టంపై స్పష్టమైన వివరాలు ఇంకా బయటకు రాలేదు.

శరణార్థుల శిబిరాల్లో భయాందోళనలు!

పోరాటాలు, తీవ్ర కరువు కారణంగా ఇప్పటికే ఇళ్లను వదిలివచ్చేసిన దాదాపు ఐదు లక్షల మందికి పైగా శరణార్థులకు బైడోవా నగరం నివాసంగా ఉంది. ఇప్పుడు ఆశ్రయం పొందుతున్న ప్రాంతంలోనే ఇలా బాంబులు, తులపాకుల మోతలు మోగడంతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో వణికిపోతున్నారు. మరోవైపు, అకస్మాత్తుగా వచ్చి పడుతున్న క్షతగాత్రులతో బైడోవాలోని ఆసుపత్రులు, అత్యవసర వైద్య సేవలు అందించలేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి బుల్లెట్ వచ్చి పడుతుందో తెలియని పరిస్థితుల్లో శరణార్థులు భయాందోళన చెందుతున్నారు!

Loading...
Unable to load recommendations.
Follow Us