ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ.. న్యూయార్క్ మేయర్‌గా మమ్‌దానీ.. హైదరబాదీ మహిళ సంచలనం..

అమెరికాలో ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మూడు ఎన్నికల్లో డెమొక్రాట్లు ఘన విజయం సాధించారు. అంతేకాకుండా.. అమెరికాలో భారత సంతతి నాయకులు చరిత్ర సృష్టించారు.. వర్జీనియా స్టేట్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా గజాలా హష్మీ విజయం సాధించగా.. న్యూయార్క్ నగరంలో మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో జోహ్రాన్‌ మమ్‌దానీ చరిత్ర లిఖించారు.

ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ.. న్యూయార్క్ మేయర్‌గా మమ్‌దానీ.. హైదరబాదీ మహిళ సంచలనం..
Zohran Mamdani Ghazala Hash

Updated on: Nov 05, 2025 | 10:04 AM

అమెరికాలో ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మూడు ఎన్నికల్లో డెమొక్రాట్లు ఘన విజయం సాధించారు. అంతేకాకుండా.. అమెరికాలో భారత సంతతి నాయకులు చరిత్ర సృష్టించారు.. వర్జీనియా స్టేట్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా గజాలా హష్మీ విజయం సాధించగా.. న్యూయార్క్ నగరంలో మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో జోహ్రాన్‌ మమ్‌దానీ చరిత్ర లిఖించారు. న్యూయార్క్‌ మేయర్‌ ఎలక్షన్స్‌లో గెలిచి వామపక్ష నేత, భారత మూలాలున్న జోహ్రాన్‌ మమ్‌దానీ చరిత్ర సృష్టించారు. న్యూయార్క్‌ మేయర్‌గా నెగ్గిన తొలి ముస్లిం వ్యక్తిగా రికార్డు సాధించారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి దారుణంగా ఓడిపోయారు. 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో, రిపబ్లికన్ కర్టిస్ స్లివాను ఓడించి.. నగరంలో మొట్టమొదటి ముస్లిం మేయర్, దక్షిణాసియా వారసత్వంలో మొదటి వ్యక్తి, ఆఫ్రికాలో జన్మించిన మొదటి వ్యక్తిగా చరిత్రలో తన స్థానాన్ని లిఖించుకున్నారు. జనవరి 1న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఒక శతాబ్దానికి పైగా నగరంలో మేయర్ బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా నిలవనున్నారు.

విజయం తర్వాత మమ్దానీ సిటీ హాల్‌లో న్యూయార్క్ సబ్‌వే రైలు ప్రారంభమవుతున్నట్లు చూపించే వీడియోను పోస్ట్ చేశారు.. గోడపై “జోహ్రాన్ ఫర్ న్యూయార్క్ సిటీ” అనే వచనం కనిపిస్తుంది. సిటీ హాల్ అనేది మేయర్ కార్యాలయం ఉన్న ప్రదేశం.

జోహ్రాన్ మమ్దానీ గురించి

ఉగాండాలోని కంపాలాలో అక్టోబర్ 18, 1991న జన్మించిన మమ్దానీ.. ఉగాండా పండితుడు మహమూద్ మమ్దానీ, ప్రఖ్యాత భారతీయ చిత్రనిర్మాత మీరా నాయర్ దంపతుల కుమారుడు.. ముందు ఉగాండా ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు, తరువాత న్యూయార్క్ నగరంలో మమ్దానీ కుటుంబం స్థిరపడింది. అక్కడ అతను బ్యాంక్ స్ట్రీట్ స్కూల్ ఫర్ చిల్డ్రన్, బ్రోంక్స్ హై స్కూల్ ఆఫ్ సైన్స్‌లో చదివాడు. అతను 2014లో బౌడోయిన్ కాలేజీ నుండి ఆఫ్రికానా స్టడీస్‌లో డిగ్రీ పట్టా పొందాడు.. అక్కడ అతను స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా అధ్యాయాన్ని సహ-స్థాపించాడు.. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు.. గతంలో ట్రంప్ నుంచి మమ్దానీపై విమర్శలు చేశారు.. ఆయన గెలిస్తే న్యూయార్క్‌ నగరం ఆర్థిక, సామాజిక విధ్వంసానికి గురవుతుందని, నగర మనుగడకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.

అమెరికాలో హైదరాబాదీ సంచలన విజయం

వర్జీనియా స్టేట్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా గజాలా హష్మీ విజయం సాదించారు. ట్రంప్‌కు విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన గజాలా.. వర్జీనియాకు తొలి మహిళా లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా రికార్డు సృష్టించారు. రిచ్‌మండ్‌ స్టేట్‌ సెనెటర్‌గా ఉన్న గజాలా హష్మీ.. రిచ్‌మండ్‌ వర్సిటీలో ప్రొఫెసర్‌గా చేశారు. 1964లో హైదరాబాద్‌లోని మలక్‌పేటలో జన్మించిన గజాలా.. ఆమెకు 4 ఏళ్ల ప్రాయంలోనే ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లింది.

గవర్నర్‌ ఎలక్షన్స్‌లోనూ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ

వర్జీనియా స్టేట్‌ గవర్నర్‌గా అబిగైల్‌ స్పాన్‌బర్గర్‌ విజయం సాధించారు. వర్జీనియాకు తొలి మహిళా గవర్నర్‌గా స్పాన్‌బర్గర్‌ రికార్డు సృష్టించారు. రిపబ్లికన్‌ స్టేట్‌గా ఉన్న వర్జీనియాలో డెమొక్రాట్ల జెండా ఎగురవేశారు. 9 నెలల ట్రంప్‌ పాలనకు రెఫరెండంగా వర్జీనియా స్టేట్‌ ఎలక్షన్స్‌ నిలిచాయి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..