Nimisha Priya: యెమెన్‌ దేశంలో భారతీయ నర్సుకు ఉరిశిక్ష.. ఈ నెల 16న అమలుకు ఆదేశాలు!

యెమెన్‌ దేశానికి చెందిన తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో భారత దేశానికి చెందిన నర్స్‌ నిమిష ప్రియకు ఆదేశం మరణ శిక్ష విధించింది. ఆమెను ఉరితీసేందుకు ఆదే అధ్యక్షుడు రషాద్‌ అల్‌ అలిమి తాజాగా ఆమోదం తెలపడంతో వచ్చే వారం అనగా ఈ నెల 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.

Nimisha Priya: యెమెన్‌ దేశంలో భారతీయ నర్సుకు ఉరిశిక్ష.. ఈ నెల 16న అమలుకు ఆదేశాలు!
Nimisha Priya

Updated on: Jul 09, 2025 | 9:12 AM

భారత దేశానికి చెందిన నర్స్‌ నిమిష ప్రియాకు యెమెన్‌ దేశం ఉరిశిక్ష విధించింది. ఇందుకు ఆదేశ అధ్యక్షుడి ఆమోదంతో ఈ నెల 16న ఈ శిక్షను యెమెన్‌ దేశం అమలు చేయనున్నట్టు కొని నివేదికల ఆధారంగా తెలుస్తోంది. కాగా నిమిష ప్రియకు మరణశిక్షను అమలు చేస్తున్నట్లు యెమెన్‌ జైలు అధికారులు కేరళలోని ఆమె కుటుంబసభ్యులకు తెలియజేసినట్లు నివేదికలు వెల్లడించాయి. మరోవైపు ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. నిమిష ప్రియకు జైలు శిక్ష ఖరారు చేసినప్పటి నుంచి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే ఉన్నామని, ఉరిశిక్ష నుండి ఆమెను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తుందని పేర్కొంది.అయితే గతంలో ఇప్పటికే ఒకసారి నిమిష ఉరిశిక్షపై క్షమాభిక్షను కోరగా అందుకు ఆదేశ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి తిరస్కించారు.

కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌ జిల్లాకు చెందిన నిమిష ప్రియా ఇక్కడే నర్సు కోర్సు పూర్తి చేసింది. ఆ సమయంలో తమ కుటుంబంలో ఆర్థిక సమస్యలు నెలకొన్న నేపథ్యంలో వాటిని తీర్చేందుకు ఆమె ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. ఈమేరకు 2008లో నిమిష ప్రియా యెమెన్‌ దేశానికి వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. కొన్నా ఉద్యోగం చేసిన తర్వాత మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చిన నిమిషా థామస్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి యెమెన్ వెళ్లాడు. అయితే 2012లో వీరిద్దరికి ఒక కూతురు పుట్టింది. దీంతో అక్కడ బిడ్డను పెంచడం కష్టమవుతుందని, నిమిష భర్త థామస్ పాపను తీసుకొని ఇండియాకు తిరిగి వచ్చాడు. కానీ నిమిష అక్కడే ఉండి ఉద్యోగం చేస్తుంది. అయితే రెండేళ్ల తర్వాత నిమిష సొంతంగా ఒక క్లినిక్‌ను ప్రారంభించాలనుకుంది. ఆ దేశ నిబంధనల ప్రకారం తలాల్‌ అదిబ్‌ మెహది అనే యెమెన్‌ దేశానికి చెందిన వ్యక్తిని భాగస్వామిగా చేసుకొని క్లీనిక్‌ను ప్రారంభించింది.

అయితే కొన్నేళ్ల పాటు క్లీనిక్ బాగానే నడించింది. ఆ తర్వాత క్లినిక్‌లో భాగస్వామిగా ఉన్న మెహది వచ్చే ఆదాయాన్ని అక్రమంగా తీసుకుంటూ, తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ నిమిష ఆరోపించింది. ఇదే విషయంపై 2016లో ఆమె స్థానిక పోలీసులను ఆశ్రయించగా వారు పట్టించుకోలేదని పేర్కొంది. ఇక చేసేదేమి లేక అతని వేధింపుల నుంచి తప్పించుకునేందుకు మెహదికి మత్తుమందు ఇచ్చి అతడి చేంపేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానిక పోలీసులు అమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. తర్వాత ఆమెను జైలుకు తరలించారు.

ఈ కేసును చేధించిన స్థానిక పోలీసులు మహదీ అనే యెమెన్ దేశానికి చెందిన వ్యక్తి నుంచి తన పాస్‌పోర్ట్‌‌ను తీసుకునే క్రమంలో జరిగిన వివాదంలో నిమిష అతడికి మత్తుమందు ఇచ్చి హత్యచేసినట్టు పోలీసుల నిర్ధారించారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపర్చి సాక్షాదారాలను కోర్టుకు అందించారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఆదేశ న్యాయస్థానం యెమెని దేశ నిబంధనల ప్రకారం నిమిషకు మరణశిక్షను విధించింది. అయితే తన మరణశిక్షను రద్దు చేయాలని ప్రియా క్షమాభిక్ష కోరినా ఆదేశ అధ్యక్షుడు అందుకు తిరస్కించారు. తాజాగా అమె మరణశిక్ష అమలుకు ఆమోదం తెలిపాడు. దీంతో ఈ నెల 16న ఆమెకు మరణశిక్షను అమలు చేస్తున్నట్టు యెమెన్‌ జైలు అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.