ఉక్రెయిన్ (Ukraine)మీద రష్యా(Russia) చేపట్టిన యుద్ధం(War) భీకరంగా సాగుతోంది.. అక్కడ ప్రధాన నగరాలపై బాంబుల మోత మోగుతోంది.. ఉక్రెయిన్ ప్రజలతో పాటుగా అక్కడ ఉన్న భారతీయులు(Indians) కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో చదువుకోడానికి వెళ్లిన ఎంతో మంది ఇండియన్ స్టూడెంట్స్‌కు ఈ యుద్ధం కష్టాలను తెచ్చిపెట్టింది.. ఉక్రెయిన్ నుంచి విమానా రాకపోకలు బంద్ కావడంతో మన పిల్లలు అక్కడే చిక్కుకుపోయి బిక్కు బిక్కుమంటున్నారు.. వీరి కోసం స్వదేశంలో తల్లిదండ్రుల బెంగపెట్టుకున్నారు. వేలసంఖ్యలో భారతీయ విద్యార్థులు, పౌరులు ఉక్రెయిన్‌లో సాయం కోసం ఎదురు చూస్తున్నారు.. వీరిని తీసుకొచ్చేందుకు మన ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసినా రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్ గగనతలం మూసుకుపోయింది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.
మన విద్యార్థులందరినీ రొమేనియా, హంగరీ మీదుగా తీసుకొచ్చే ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు తమ వాహనాలపై భారత్ జెండాను పెట్టుకొని సరిహద్దులకు చేరుకోవాలని సూచించింది ఉక్రెయిన్‌లో భారత రాయబార కార్యాలయం. విద్యార్థులంతా టీమ్స్‌గా బయల్దేరాలని..పాస్‌పోర్టులు, నిత్యావసర వస్తువులతో సిద్ధంగా ఉండాలని.. కరోనా డబుల్ వ్యాక్సిన్ మస్ట్ అని సూచించింది.
ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులు ఆందోళన చెందక్కర్లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ ఆ దేశాధ్యక్షులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు కిషన్‌రెడ్డి. ఉక్రెయిన్‌లో విద్యార్థుల సమాచారం కోసం ఎంబసీ ఓ అప్లికేషన్‌ను రూపొందించిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.ఆ డీటెయిల్స్‌తో విద్యార్థులను సంప్రదించడం సులువవుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేశాయి. ఢిల్లీ, హైదరాబాద్‌లలో కాల్ సెంటర్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతున్నామన్నారు. విద్యార్థులు సేఫ్ ప్లేస్ చూసుకొని అక్కడే ఉండాలని.. ఎవరికీ అభద్రతా భావం అవసరం లేదన్నారు. హైదరాబాద్ సెక్రటెరియట్‌లో హెల్ప్‌లైన్: 040-23220603 నెంబర్‌తో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మెయిల్ ఐడీ కేటాయించారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులను తరలించేందుకు ఆరుగురు ఉన్నతాధికారులతో ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు ఏపీ సీఎస్ సమీర్ శర్మ. పోలాండ్, ఉక్రెయిన్ సరిహద్దు, అలాగే మరో బోర్డర్ కు ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను తరలించేందుకు విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిందని చెప్పారువిద్యార్థుల తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు సీఎస్. ఇందు కోసం 0863-2340678 నెంబర్‌తో హెల్ప్‌లైన్..8500027678 వాట్సప్ నెంబర్.. ప్రత్యేక మెయిల్ ఐడీ కేటాయించారు.
మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు ధైర్యం చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు.. విద్యార్థులంతా ఒక చోట ఉండాలని సూచించారు. విద్యార్థుల తరలింపు కోసం జరుగుతున్న ప్రయత్నాలకు టీడీపీ ఎన్నారై సెల్ పర్యవేక్షిస్తోందని తెలిపారు..
ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులకు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాలు శనివారం తెల్లవారుజామున 2 గంటలకు బయలు దేరుతున్నాయి. విద్యార్థులకు తీసుకువచ్చేందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించనుంది.
#WATCH The first batch of evacuees from Ukraine reach Romania via the Suceava border crossing. Our team at Suceava will now facilitate travel to Bucharest for their onward journey to India: MEA Spokesperson Arindam Bagchi
(Source: Arindam Bagchi’s Twitter handle) pic.twitter.com/c4uevDh68l
— ANI (@ANI) February 25, 2022
ఇవి కూడా చదవండి: Russia Ukraine War: ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్‌ను కూల్చేస్తాం.. యూరప్, అమెరికాలకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్..
Dental Care: దంతాలు పసుపురంగులో ఉన్నాయా..? అయితే ఈ ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలు తెల్లగా మారిసిపోతాయి..