మూన్‌పైకి మనోడు… నాసా బృందంలో భారత సంతతికి చెందిన రాజా చారి …. ఆర్టిమిస్ కార్యక్రమంలో భాగం…

| Edited By:

Dec 11, 2020 | 3:24 PM

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మానవ సహిత చంద్రయాన కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి ఆర్టిమిస్ అనే పేరు పెట్టింది. అయితే చందమామపై మరోసారి కాలు మోపేందుకు సన్నద్ధమవుతున్న నాసా బృందంలో భారత సంతతి వ్యక్తికి స్థానం లభించింది.

మూన్‌పైకి మనోడు... నాసా బృందంలో భారత సంతతికి చెందిన రాజా చారి .... ఆర్టిమిస్ కార్యక్రమంలో భాగం...
Follow us on

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మానవ సహిత చంద్రయాన కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి ఆర్టిమిస్ అనే పేరు పెట్టింది. అయితే చందమామపై మరోసారి కాలు మోపేందుకు సన్నద్ధమవుతున్న నాసా బృందంలో భారత సంతతి వ్యక్తికి స్థానం లభించింది. నాసా మిషన్‌కు 43 ఏళ్ల రాజా జాన్ వుర్పుత్తూర్ చారి ఎంపికయ్యాడు. ప్రస్తుతం అతడు శిక్షణలో పాల్గొంటున్నట్లు నాసా సంస్థ ప్రకటించింది.

గర్వకారణం…

చంద్రుడి పైకి వెళ్లే కార్యక్రమంలో తాను భాగమవడం గర్వంగా ఉందని రాజా అన్నారు. తన తల్లిదండ్రుల పెంపకం వల్లే తనకు ఈ అవకాశం లభించిందని తెలిపారు. కాగా, చారి మస్సాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, యూఎస్ నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. 2017లో నాసాలో చేరారు. ఆ తర్వాత మూన్ మిషన్‌లో భాగమయ్యారు.