Sri Lanka Crisis – Indian Army: ఆర్థిక సంక్షోభం వల్ల శ్రీలంకలో పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. ఈ క్రమంలో నిరసనకారులను ఆపడానికి, హింసను అరికట్టేందుకు శ్రీలం ప్రభుత్వం పలు కఠిన చర్యలు తీసుకుంటోంది. అల్లర్లకు పాల్పడే వారు కనిపిస్తే.. కాల్చేయాలంటూ ఇప్పటికే సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే.. శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో భారత బలగాలను కొలంబోకు పంపనున్నట్లు వార్త కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. హింసను నియంత్రించేందుకు శ్రీలంకకు భారత బలగాలను పంపుతున్నారంటూ ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ఈ ప్రచారంపై భారత్ స్పందించింది. శ్రీలంకకు భారత్ పూర్తిగా మద్దతు ఇస్తుందని.. కానీ ఇదంతా అసత్య ప్రచారం అని ఖండించింది. ఆ దేశ ప్రజాస్వామ్యానికి, స్థిరత్వానికి, ఆర్థిక పునరుద్ధరణకు భారత్ మద్దతు ఇస్తుందని.. కొలంబోలోని భారత హై కమిషన్ బుధవారం వెల్లడించింది. ఈ అసత్య ప్రచారాలను నమ్మవద్దంటూ సూచించింది. దీంతోపాటు మాజీ ప్రధాని మహింద రాజపక్సే.. ఆయన కుటుంబసభ్యులు ఇండియాకు పారిపోయినట్లు వస్తున్న ప్రచారాన్ని సైతం ఇండియన్ మై కమిషన్ కొట్టిపారేసింది. ఈ ఊహాజనిత అభిప్రాయలు, నివేదికలు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో ప్రచారం జరుగుతోందని.. అలాంటి వాటిని భారత ప్రభుత్వం ఆమోదించడం లేదని హై కమిషన్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో తెలిపింది.
The High Commission would like to categorically deny speculative reports in sections of media and social media about #India sending her troops to Sri Lanka. These reports and such views are also not in keeping with the position of
the Government of #India. (1/2) ఇవి కూడా చదవండి— India in Sri Lanka (@IndiainSL) May 11, 2022
కాగా.. 1948లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శ్రీలంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనడం ఇదే తొలిసారి. దీంతో శ్రీలంక ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తీవ్రమైన నిరసనల అనంతరం మహీందా రాజపక్సే సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేశారు.. ఆ తర్వాత నిరసనకారులు రాజపక్సే, అతని మద్దతుదారుల ఇళ్లపై దాడి చేశారు. అయితే.. రాజీనామా చేసిన తర్వాత రాజపక్సే ఎక్కడికి వెళ్లారన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో పలు వార్తా కథనాలు వెలువడుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: