
నాలుగు ఉక్రెయిన్ భూభాగాలను రష్యా ఆక్రమించడాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఎ) బుధవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మొత్తం 143 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా.. ఐదు దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. భారత్‌తో సహా 35కి పైగా సభ్య దేశాలు ఈ ప్రతిపాదనకు దూరంగా ఉండి ఓటింగ్‌లో పాల్గొనలేదు. భద్రతా మండలిలో రష్యా ఇదే విధమైన తీర్మానాన్ని వీటో చేసిన కొన్ని రోజుల తరువాత.. ఇందులో భారతదేశం పాల్గొనలేదు.
రష్యాపై అభిశంసన తీర్మానం ఆమోదం పొందడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత.. ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలను రక్షించడం” అనే ఈ రెండు చారిత్రాత్మక తీర్మానానికి మద్దతు ఇచ్చిన 143 రాష్ట్రాలకు కృతజ్ఞతలని జెలెన్స్కీ ట్వీట్ చేశారు.
Grateful to 143 states that supported historic #UNGA resolution “Territorial integrity of Ukraine: defending the principles of the UN Charter”. The world had its say – RF’s attempt at annexation is worthless & will never be recognized by free nations. ?? will return all its lands pic.twitter.com/FupYPfZz8M
— Володимир Зеленський (@ZelenskyyUa) October 12, 2022
సోమవారం (అక్టోబర్ 10) ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో రష్యాకు భారత్ పెద్ద ఝలక్ ఇచ్చింది. రహస్య బ్యాలెట్‌ను నిర్వహించాలన్న పుతిన్ డిమాండ్‌ను భారత్ తిరస్కరించింది. వాస్తవానికి, ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించినందుకు రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ముసాయిదా తీర్మానం తీసుకురాబడింది. రష్యాను ఖండించడానికి బహిరంగ ఓటు వేయాలని తీర్మానం కోరింది. అయితే పుతిన్ దానిపై రహస్య ఓటు వేయాలని కోరుకున్నారు. మరోవైపు, పుతిన్ ఈ డిమాండ్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో భారత్ ఓటు వేసింది. ఈ ప్రతిపాదనను అల్బేనియా తీసుకొచ్చింది.
అల్బేనియన్ ప్రతిపాదనకు అనుకూలంగా 107 ఓట్లు రాగా, 13 దేశాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. మరోవైపు చైనా, ఇరాన్, రష్యా సహా 24 దేశాలు తీర్మానంపై ఓటింగ్ చేయలేదు. సెప్టెంబరు చివరి వారంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా ఉక్రెయిన్‌లోని దొనేత్సక్, లుహాన్స్క్, ఖెర్సన్‌తోపాటు జాపోరిజ్జియా.. ఈ నాలుగు ప్రాంతాల విలీనాన్ని ప్రకటించే పత్రాలపై సంతకం చేశారు.
క్రిమియా బ్రిడ్జి పేలుడు తర్వాత ఈ వారం రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో రష్యా ఇప్పుడు ఉక్రెయిన్‌పై వైమానిక దాడులను ముమ్మరం చేసింది. నిన్న కూడా, కైవ్‌లో శీఘ్ర క్షిపణి దాడులు జరిగాయి. రోజంతా డేంజర్ సైరన్‌లు వినిపించాయి. ఉక్రెయిన్ ప్రభుత్వం పౌరులను ఎయిర్ రైడ్ షెల్టర్‌కు వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు రష్యా దూకుడు చర్యను ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్రంగా ఖండించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం