America: అద్భుతం.. ఆస్పత్రిలో ఒకే సెక్షన్‌లో పనిచేస్తున్న 11 మంది మహిళలకు ఏకకాలంలో గర్భం.. నివ్వెరపోతున్న జనం

|

May 16, 2022 | 10:13 AM

మిస్సోరిలోని లిబర్టీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న 11 మంది వైద్య సిబ్బంది ఏకకాలంలో గర్భవతి అయ్యారు. వీరిలో 10 మంది నర్సులు, ఒక వైద్యురాలు  ఉన్నారు.

America: అద్భుతం.. ఆస్పత్రిలో ఒకే సెక్షన్‌లో పనిచేస్తున్న 11 మంది మహిళలకు ఏకకాలంలో గర్భం.. నివ్వెరపోతున్న జనం
Hospital In America
Follow us on

America Hospital: కొన్ని కొన్ని సంఘటనలు వింతగా అనిపిస్తాయి.. నిజంగా ఇలాంటివి జరుగుతాయా అంటూ షాక్ కలుగుతాయి. తాజాగా  అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలోని ఓ ఆస్పత్రిలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. మిస్సోరిలోని లిబర్టీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న 11 మంది వైద్య సిబ్బంది ఏకకాలంలో గర్భవతి అయ్యారు. వీరిలో 10 మంది నర్సులు, ఒక వైద్యురాలు  ఉన్నారు. అందులో ఇద్దరి డెలివరీ తేదీ కూడా ఒకే రకంగా ఉండడం గొప్ప విషయం. యాదృచ్ఛికంగా, ఈ నర్సులలో చాలా మంది ఆసుపత్రిలోని ప్రసూతి, లేబర్ , డెలివరీ విభాగాలలో పనిచేస్తున్నారు. ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఇంత పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు ఏకకాలంలో గర్భం దాల్చడం ఇదే తొలిసారి.

కలిసి పనిచేసిన నర్సులు: 
ఆసుపత్రి ప్రసవ కేంద్రం డైరెక్టర్ నిక్కీ కాలింగ్ మాట్లాడుతూ.. గర్భం దాల్చిన ఈ నర్సులందరూ కలిసి ఏదైనా పని చేసేవారని, అయితే వారిలో 10 మంది ఒకేసారి గర్భం దాల్చుతారని తాము ఊహించలేదని చెప్పారు. ప్రస్తుతం తమకు ఇది చాలా ఫన్నీ మూమెంట్ అని అన్నారు. ఈ వైద్య సిబ్బందిలో కొంతమందికి డెలివరీ వచ్చే కొన్ని వారాల్లో జరుగుతుంది.. మిగిలిన నర్సులడెలివరీ సమయం.. సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఉంటుంది. ఆసుపత్రి పరిపాలన స్థానిక చట్టం, ఆసుపత్రి నియమాల ప్రకారం గర్భవతులైన ఈ నర్సులందరికీ అన్ని సహాయాన్ని అందజేస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇదే విషయంపై గర్భిణీ నర్సు మాట్లాడుతూ.. 
గర్భవతి హన్నా మిల్లర్ ( 29) మాట్లాడుతూ.. చాలా మంది నర్సులు ఆస్పత్రిలో నీళ్లు తాగబోమని చెబుతున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కొందరు నర్సులు రోజు తమ ఇంటి నుండి వాటర్ బాటిల్‌ తో నీరు తెచ్చుకుంటున్నారని చెప్పారు. 11 మంది నర్సులు ఏకకాలంలో గర్భం దాల్చారనే విషయం తెలయడంతో వైరల్ గా మారింది. ఈ వింత చోటు చేసుకోవడానికి ఆస్పత్రిలోని నీళ్లలో ఏదో ఉందని ఎవరో సరదాగా కామెంట్ చేస్తున్నారు.

 గైనకాలజిస్ట్ డాక్టర్ కూడా గర్భవతి: 

నర్సులతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్  అన్నా గోర్మాన్ కూడా గర్భవతి కావడం విశేషం. తాను రెండో బిడ్డకు జన్మనివ్వడం కోసం ఎదురుచూస్తున్నట్లు డాక్టర్ అన్నా చెప్పారు. ప్రస్తుతం నర్సులు, తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని అన్నారు. మేము అందరం ఒకే యూనిట్‌లో పని చేస్తున్నందున ఇది నిజంగా ప్రత్యేకమైనదని భావిస్తున్నట్లు చెప్పారు అన్నా.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..