Pakistan Minister: భారత నడిబొడ్డున పాక్ ప్రధాని ఇమ్రాన్ సభ పెడితే.. మోడీ కంటే ఎక్కువ జనాభా వస్తారంటున్న పాక్ మంత్రి

Pakistan Minister: పాకిస్థాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవద్ చౌదరి మళ్ళీ భారత ప్రధాని మోడీపై తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు..

Pakistan Minister: భారత నడిబొడ్డున పాక్ ప్రధాని ఇమ్రాన్ సభ పెడితే.. మోడీ కంటే ఎక్కువ జనాభా వస్తారంటున్న పాక్ మంత్రి
Pak Minister

Updated on: Oct 25, 2021 | 9:50 AM

Pakistan Minister: పాకిస్థాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవద్ చౌదరి మళ్ళీ భారత ప్రధాని మోడీపై తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్  భారతదేశ రాజధాని ఢిల్లీలో బహిరంగ సభ పెడితే.. భారత ప్రధాని మోడీ సభ కంటే కూడా ఎక్కువ జనాభా మా ప్రధాని సభకు వస్తారని తెలిపారు. ఎందుకంటే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారత దేశములో అత్యధిక జనాదరణ ఉందని మంత్రి ఫవద్ చౌదరి చెప్పారు.  ఫవద్ చేసిన వ్యాఖ్యలు కొద్ది క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. నెటిజన్లు భారీ స్పందిస్తున్నారు.

ఇక కరోనాతో ఓ వైపు..  ద్రవ్యోల్బణంతో మరోవైపు పాకిస్థాన్ విలవిలాడుతోంది.  ఆహారం, గృహనిర్మాణం, నిర్మాణం అన్ని రంగాలపై భారీగా ప్రభావం చూపిస్తోంది. ఎంతగా అంటే.. ఒక్క టీ సాగాలంటే సామాన్యుడు ఆలోచించే విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఒక్క టీ ధర రూ. 40.. ఇక స్వయంగా పాక్ మంత్రి.. పాకిస్థాన్ లోని భావితరాలకు కాపాడుకోవాలంటే.. పాక్ ప్రజలు త్యాగాలు చేయాలనీ.. రోజుకు ఒక్కపూట మాత్రమే ఆహారం తినాలని చేసిన వ్యాఖ్యలు అన్నీ గుర్తు చేస్తూ నెటిజన్లు ఫవద్ పై విరుచుకుపడుతున్నారు.

Also Read:  ప్రజా సమస్యలపై పోరుబాట పట్టనున్న జనసేనాని.. త్వరలో అన్ని జిల్లాల్లో పర్యటన..