అమెరికా, నార్త్ కొరియా మధ్య విభేదాలు తీవ్ర వైషమ్యాలకు దారి తీస్తున్నాయి. సౌత్ కొరియా , జపాన్ తదితర తన మిత్ర దేశాలకు అమెరికా దగ్గరవుతుండడం ఉత్తర కొరియా సహించలేకపోతోంది. గతవారం అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలను ప్రారంభించగా దీన్నిప్యాంగాంగ్ లోని అధికార వార్తా పత్రిక ..’మా భూమిపై గన్ పౌడర్ చల్లాలనుకుంటే..( పోరాటానికి దిగాలనుకుంటే) అమెరికాలోని కొత్త ప్రభుత్వం (జోబైడెన్ ప్రభుత్వం) కొన్ని సలహాలను ఆలకించాల్సిందే’ అంటూ పరోక్షంగా హెచ్చరించింది. ఇదే సందర్భంలో నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ‘వచ్చే నాలుగేళ్ళూ మీరు సుఖంగా నిద్రించాలనుకుంటే ఈ ‘సౌకర్యాన్ని పోగొట్టుకునే’ ఎలాంటి పనులు ప్రారంభించకండి’ అని ప్రకటించింది. పైగా ఉత్తర కొరియాకు అమెరికా మరో చర్య కూడా ఆగ్రహం కలిగించింది. పెంటగాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ నిన్న జపాన్, సౌత్ కొరియాలను సందర్శించారు. అణ్వాయుధాల కోసం తహతహలాడుతున్న నార్త్ కొరియాను ఏకాకిని చేసేందుకు, చైనాను ఎండగట్టేందుకు వీరు ఓ సమైక్య ఫ్రంట్ ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు కిమ్ కి అన్నివిధాలా అండదండలుగా ఉన్న అతని సోదరి కిమ్ యో జోంగ్ చేసిన ఈ హెచ్చరిక అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
పొరుగునఉన్న చైనా నుంచి కరోనా వైరస్ తమదేశంలోకి వ్యాపించకుండా చూసేందుకు ఉత్తర కొరియా తనను తాను ఏకాకిని చేసుకుంది. దాదాపు అన్ని దేశాలతోనూ సంబంధాలకు దూరంగా ఉంటూ వస్తోంది. తమ మిసైల్ పరీక్షలను , న్యూక్లియర్ టెస్టులను వ్యతిరేకిస్తున్న దేశాలతో కోరి శత్రుత్వాన్ని తెచ్చుకుంటోంది. వివిధ దేశాలు ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షల కారణంగా ఈ దేశం ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో పడింది. కిమ్ ప్రభుత్వంకే వలం మిలిటరీ అవసరాలకోసమే నిధులను మంజూరు చేస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ :గ్రహంపై గంటల శబ్దం , మాటల గుసగుసలు..!ఆడియో విడుదల చేసిన నాసా.:The NASA delivered audio by lazers video.
ఆ 73.. పురుషులకు.. ఒకటి మహిళకు..ఆమెకే ఎందుకిలా జరుగుతుంది..!?:International Cricketers Video