Two Sets of Identical Twins: ప్రశాంత్, ఐశ్వర్య రాయ్ హీరో హీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన జీన్స్ సినిమా . వెండి తెరపై ఒక అద్భుత ప్రేమ కథా చిత్రం. తమిళ మాతృక నుంచి జీన్స్ గా డబ్ అయి తెలుగు తెరపై కాసుల వర్షం కురిపించిన సినిమా. ఎక్కడైనా ఇద్దరు కవల పిల్లలకు పెళ్లి అనగానే వెంటనే ఎవరిమదిలోనైనా జీన్స్ మూవీ తడుతుంది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ పలు సందర్భాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఈ సినిమా స్పెషల్ హీరో ప్రశాంత్ కవలలు.. అంతేకాదు.. హీరో తండ్రి నాజర్ కూడా కవలలే..
ప్రశాంత్ తండ్రి నాజర్ కొని కారణాల వలన భారత్ కు నుంచి అమెరికాకు వెళ్లి.. అక్కడ లాస్ ఏంజిలెస్ లో ఒక రెస్టారెంట్ ని రన్ చేస్తుంటాడు. అతనికి ఇద్దరు కొడుకులు వైద్య విద్యనభ్యసిస్తూ ఉంటారు. తన కొడుకులిద్దరికి కవల ఆడపిల్లల్నే ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు.. కానీ అనుకోని పరిస్థితుల్లో కొడుకు రాము ప్రేమని అంగీకరించి తన నిర్ణయం మార్చుకుని ఐశ్వర్య రాయ్ ని ఇచ్చి చేస్తాడు. ఇదంతా సినిమా కానీ ఇదే సినిమా నిజజీవితంలో కనిపిస్తే.. అవును ఇప్పటి వరకూ జీవిత కథలను సినిమాలుగా తెరకెక్కించినవి తెలుసు.. కానీ సినిమాలోని కథ.. నిజజీవితంలో దర్శనమిచ్చింది. అదీ అమెరికాలో వివరాల్లోకి వెళ్తే..
అవును జీన్స్ సిన్మాను మించి.. నిజజీవితం కవల అక్కా చెల్లెళ్లు కవల సోదరులను ప్రేమించారు. వీరు ఇప్పుడు ఒకే ఇంట్లో సంతోషంగా జీవిస్తున్నారు. కలసి కాపురం చేస్తున్నారు. అమెరికాలో లుకాస్, జాకబ్ – వెరెసా, కెరిసాలు ఇప్పడు అదే చేస్తున్నారు. పైగా వీరంతా వైద్య రంగంలోనే పనిచేయడం మరో విశేషం.
అమెరికాలోని ఆరెగాన్‌లో 25 ఏళ్ల కవల అక్కాచెల్లెళ్లు వెనెసా, కెరిసాలు నివసిస్తున్నారు. వీరిద్దరికీ కవలసోదరులు లైఫ్ పాట్నర్స్ గా లభించారు. 29 ఏళ్ల లుకాస్, జాకబ్ సీల్బీ అనే ఈ ఇద్దరు అన్నదమ్ములు ప్రస్తుతం వెరెసా, కెరిసాలతో డేట్ చేస్తున్నారు. అంతేకాదు లుకాస్,జాకబ్ – వెరెసా, కెరిసాలు ఒకే ఇంట్లో సంతోషంగా గడుపుతున్నారు. ఇంకా విశేషం ఏమిటంటే.. ఈ నలుగురు వైద్య రంగంలోనే పనిచేస్తున్నారు. లుకాస్, జాకబ్ – వెనెసా, కెరిసాలు తొలిసారిగా 2020 జూన్‌లో కలుసుకున్నారు. అప్పుడు పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు డేటింగ్ చేస్తున్నారు. తమ ప్రేమ గురించి కవుల సోదరిలోని వెనెసా మాట్లాడుతూ.. తాము నలుగురం కలిసే ఉంటున్నామని.. కవలలుగా పుట్టి కవలలతోనే ఉంటున్నందుకు ఆనందంగా ఉంది అని చెప్పారు. ఇక తమ పరిచయం ప్రేమ గురించి జాకబ్ స్పందిస్తూ.. కొన్ని ఘటనలు మనకు తెలియకుండానే జరిగిపోతాయి. మాకు పరిచయం ఎలా జరిగింది అనేది ఇప్పటికే ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది..
Also Read: Afghan Crisis: కొన్ని వేలకోట్ల విలువజేసే 2వేల ఏళ్లనాటి నిధిపై తాలిబన్ల కన్ను… అంత డబ్బువారి చేతులో పడితే..