‘ఇటీజ్ సో గుడ్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్నా’, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటన

| Edited By: Phani CH

Mar 20, 2021 | 6:58 PM

కరోనా వైరస్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికాను తను తీసుకున్నానని, ఇది ఎంతో మంచి ఫీల్ నిచ్చిందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.  కోవిడ్ పాజిటివ్ కి గురై గత  ఏడాది ఏప్రిల్ లో చికిత్స పొందిన ఆసుపత్రిలోనే ఆయన నిన్న ఈ టీకామందు తీసుకున్నారు.

ఇటీజ్ సో గుడ్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్నా, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్  ప్రకటన
Uk Pm Boris Johnson
Follow us on

కరోనా వైరస్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికాను తను తీసుకున్నానని, ఇది ఎంతో మంచి ఫీల్ నిచ్చిందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.  కోవిడ్ పాజిటివ్ కి గురై గత  ఏడాది ఏప్రిల్ లో చికిత్స పొందిన ఆసుపత్రిలోనే ఆయన నిన్న ఈ టీకామందు తీసుకున్నారు. ‘ది రిస్క్ ఈజ్ కోవిడ్..దిసీజ్ ఏ గ్రేట్ థింగ్ టు డూ’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్ వంటి యూరోపియన్  యూనియన్ దేశాలు ఈ వ్యాక్సిన్ ను నిషేధించాయి. ఇది తీసుకున్న  రోగుల్లో కొంతమందికి రక్తం గడ్డ కట్టడం వంటి రుగ్మతలు తలెత్తాయని, అందువల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఆస్ట్రాజెనికాను బ్యాన్ చేశామని ఈ దేశాలు పేర్కొన్నాయి. కానీ ఇది తప్పని నిరూపించేందుకా అన్నట్టు బోరిస్ జాన్సన్ తాను స్వయంగా ఈ టీకా మందు తీసుకున్నారు. ఇది సురక్షితమైనదని అన్నారు.  బ్రిటన్ సహా యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సేఫ్ అని ఇదివరకే స్పష్టం చేశాయి. ఆయా సంస్థల అభిప్రాయాల నేపథ్యంలో తనీ టీకా మందును తీసుకున్నానని, ఇప్పటికైనా దీనిపై అపోహలను విడనాడాలని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.

 

మా దేశంలో ఆరు లక్షల 60 వేలకు పైగా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్  డోసులను ప్రజలకు ఇచ్చినట్టు ఆయన చెప్పారు. దీని నాణ్యత గురించి తమ దేశ రెగ్యులేటరీ ఏం చెబుతోందో రీసెర్చర్లు వినాలని ఆయన కోరారు. దీన్ని అభివృద్ధి పరచిన  శాస్త్రజ్ఞులకు,  దీన్ని ప్రజలకు ఇస్తున్న నేషనల్ హెల్త్ సర్వీసు సిబ్బందికి, హెల్త్ కేర్ వర్కర్లకు, డాక్టర్లకు ధన్యవాదాలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు.   మళ్ళీ మనం మన దైనందిన కార్యకలాపాల్లోకి వెళ్లాలంటే ఈ విధమైన వ్యాక్సిన్లను తీసుకోవాలని, ఆరోగ్యంగా  ఉండాలని బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. ఇప్పటికే మనం జాప్యం చేశామని అయన పరోక్షంగా పేర్కొన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ముకేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కేసులో కీలక అప్డేట్..! పూర్తి వివరాలు

మంచి మనసు చాటుకున్న జ్యోతిరాదిత్య సింధియా.. గాయపడిన పోలీసుకు సపర్యలు.. వీడియో వైరల్