Nimisha Priya: ఈ ‘నిమిషా’నికి ఓకే.. కానీ మున్ముందు ఏం జరగబోతుంది..?

యెమెన్‌లో షరియా చట్టాలు అమలవుతాయి. హత్య కేసులో దోషిగా తేలితే క్షమించరు. వెంటనే శిక్ష ఖరారు చేస్తారు, ఉరితీస్తారు. ప్రపంచంలోనే ఉరిశిక్షలు ఎక్కువగా అమలవుతున్న టాప్‌-5 దేశాల్లో యెమన్‌ ఉందంటే.. కారణం అక్కడి కఠిన చట్టాలే. నిమిష ప్రియ అక్కడి స్థానికుడిని హత్య చేసింది 2017లో. అప్పుడే ఉరిశిక్ష ఖరారు చేశారు కూడా. మరెందుకని వెంటనే శిక్ష అమలు చేయలేదు? నిమిషప్రియను ఉరితీయడానికి యెమెన్ ప్రభుత్వం ఎందుకని తొందరపడలేదు? ఒక కేసులో శిక్ష అమలుచేయడానికి ఇంతకాలం పట్టడం యెమెన్‌ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదో మిరాకిల్‌ కూడా. అంటే.. క్షమాభిక్షకు నిమిష అర్హురాలే అని భావించడమే కారణమా? ఇంతకీ... ఏ కేసులో మలుపులేంటి?

Nimisha Priya: ఈ నిమిషానికి ఓకే.. కానీ మున్ముందు ఏం జరగబోతుంది..?
Nimisha Priya

Updated on: Jul 15, 2025 | 10:12 PM

నిమిషప్రియను మరణశిక్ష నుంచి తప్పించలేమని కేంద్రం ప్రభుత్వం స్వయంగా సుప్రీంకోర్టుకు నివేదించిన తరువాత.. ఓ అద్భుతం జరిగింది. 24 గంటలు తిరక్కుండానే యెమెన్‌ ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించి, ప్రస్తుతానికి ఉరిశిక్ష వాయిదా పడేలా చేయగలిగింది భారత ప్రభుత్వం. నిమిషకు ఉరిశిక్ష ఖరారైనప్పటి నుంచి నిత్యం సంప్రదింపులు చేస్తూనే వస్తోంది కేంద్రం. అక్కడి జైలు అధికారులతో, యెమెన్‌లోని ప్రాసిక్యూటర్‌ ఆఫీస్‌తో మాట్లాడుతూనే ఉంది. కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే.. కొలిక్కి రాలేదీ మ్యాటర్. ప్రతీ దేశంతో దౌత్యపరమైన సంబంధాలు ఎంత ముఖ్యమో చెప్పిన ఓ కేస్‌ స్టడీ ఇది. భారత్‌కు ఇంటర్నేషనల్‌గా పవర్‌ ఉంది కదా.. యెమెన్‌ ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించలేకపోయింది ఇంతకాలం అనే సందేహం రావడం సహజం. కాని, అన్ని దేశాల్లా కాదు యెమెన్. 2014 ముందు వరకు యెమెన్‌తో మంచి సంబంధాలే ఉన్నాయి. 2015లో హౌతీ రెబల్స్‌ తిరుగుబాటు చేయడం, ఆ దేశంలో అంతర్యుద్ధం మొదలవడంతో ఆ రిలేషన్స్‌ అన్నీ తెగిపోయాయి. యెమెన్‌కు భారతీయులెవరూ వెళ్లొద్దని రాకపోకలు కూడా నిలిపివేసింది భారత ప్రభుత్వం. 2015 ఏప్రిల్‌లో యెమెన్‌ రాజధాని సనాలో ఉన్న భారత దౌత్య కార్యాలయాన్ని సైతం అక్కడి నుంచి తరలించింది. సో, ఆ దేశంతో సంప్రదింపులు చేయడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. సరిగ్గా అలాంటి సమయంలో కేసులో ఇరుక్కుపోయింది ఈ కేరళ నర్సు నిమిష ప్రియ. ఒక మనిషిని చంపడం కచ్చితంగా తప్పే. ఆ కోణంలో నిమిష చేసింది...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి