‘నాపై హత్యా యత్నం చేసిన అతడెలా తప్పించుకున్నాడు’ ? పాక్ ప్రధాని నుద్దేశించి మలాలా ట్వీట్

| Edited By: Anil kumar poka

Feb 18, 2021 | 4:33 PM

తొమ్మిదేళ్ల క్రితం (2012లో) తనపై కాల్పులు జరిపి హత్యాయత్నం చేసిన ఎహ్ సాన్ అనే వ్యక్తి ప్రభుత్వ కస్టడీ నుంచి ఎలా తప్పించుకున్నాడని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ ప్రశ్నించింది.

నాపై హత్యా యత్నం చేసిన అతడెలా తప్పించుకున్నాడు ? పాక్ ప్రధాని నుద్దేశించి మలాలా ట్వీట్
Follow us on

తొమ్మిదేళ్ల క్రితం (2012లో) తనపై కాల్పులు జరిపి హత్యాయత్నం చేసిన ఎహ్ సాన్ అనే వ్యక్తి ప్రభుత్వ కస్టడీ నుంచి ఎలా తప్పించుకున్నాడని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ ప్రశ్నించింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను, ఆర్మీని ఉద్దేశించి ఆమె ట్వీట్ చేసింది.  ఎహసనుల్లా ఎహ్ సాన్ అనే వ్యక్తి ‘ఈ సారి నేను పొరబాటు చేయను’ అంటూ ఇటీవల ట్వీట్ చేశాడు. తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్తాన్  అనే ఉగ్రవాద సంస్థకు మాజీ అధికార ప్రతినిధి అయిన ఎహ్ సాన్…  మలాలాను ఇలా  హెచ్ఛరించాడు . (దీంతో ట్విటర్ ఇతని ఖాతాను శాశ్వతంగా నిషేధించింది). దీనిపై స్పందించిన మలాలా.. లోగడ నాపైన, పలువురు అమాయకులపైన జరిగిన దాడికి ఇతడే బాధ్యుడని, ట్వీట్ ద్వారా నన్ను బెదిరిస్తున్నాడని పేర్కొంది.

గత ఏడాది జనవరి 11 న ఎహ్ సాన్ పాక్ జైలు నుంచి తప్పించుకున్నాడు. జైలు నుంచి తను ‘విజయవంతంగా’ పారిపోగలిగానని ఆ మధ్య ఓ ఆడియో మెసేజ్ లో ఇతడు  తెలిపాడు. 2012 ఫిబ్రవరి 5 న తను ఓ ఒప్పందం కింద పాక్ సెక్యూరిటీ అధికారులకు లొంగిపోయానని, మూడేళ్ళ పాటు దీన్ని గౌరవించానని, కానీ అధికారులు దీన్ని ఉల్లంఘించి నా పిల్లలతో సహా నన్ను కూడా జైల్లో పెట్టారని అన్నాడు. కాగా-మలాలా ట్వీట్ పై పాక్ ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.


మరిన్ని చదవండి ఇక్కడ :

 

CM KCR Rare And Old Photos: అలుపెరుగని యోధుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరుదైన మధురస్మృతులు.

Chief Guest Jr NTR: కరోనా కూడా వాక్సిన్ ఉంది కానీ ఇలాంటి వాటికీ ఎలాంటి వాక్సిన్ లు లేవు : జూనియర్ ఎన్టీఆర్.

వీడు మనిషేనా ? వీధి కుక్కపై లైంగిక దాడి..Man rapes dog in Mysuru act caught on camera Video