కయ్యాలమారి చైనా చేతిలో న్యూక్లియర్ కొరివి.. డ్రాగన్ అణు దాహం తీరనిది..!

అమెరికా, రష్యా, చైనా..! ఈ మూడు అగ్రరాజ్యాల మధ్య.. కొన్నేళ్లుగా ఆయుధాల పోటీ నెలకొంది. నేనే నెంబర్‌ ఒన్‌ అంటే.. లేదు లేదు.. నా దగ్గరే ఎక్కువు అణు బాంబులు ఉన్నాయని ఆ దేశాలు సవాల్‌ విసురుకున్నాయి. ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాలలో 90 శాతం అమెరికా, రష్యా దగ్గరే ఉన్నాయి. ఆయుధ పోటీతో అమెరికా, రష్యాలు కాస్త అలసిపోయినా.. డర్టీ డ్రాగన్‌ అణ్వాయుధ దాహంతో రెచ్చిపోతోంది.

కయ్యాలమారి చైనా చేతిలో న్యూక్లియర్ కొరివి.. డ్రాగన్ అణు దాహం తీరనిది..!
China Nuclear Expansion

Updated on: Jun 21, 2024 | 4:40 PM

అణు యుద్ధం..!! ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య హైటెన్షన్‌ నెలకొన్నా యావత్ ప్రపంచాన్ని వణికించే పదం ఇది..! రెండో ప్రపంచ యుద్ధంలో ఈ న్యూక్లియర్‌ వార్‌తో.. ఏకంగా రెండు నగరాలు సర్వనాశనమయ్యాయి. లక్షలాది మంది జీవితాలను చిదిమేశాయి. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో న్యూక్లియర్ వార్ భయాలు మళ్లీ ప్రపంచ దేశాల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. అవసరమైతే ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించేందుకు వెనుకాడబోమని పుతిన్ ఇటీవల సంచలన ప్రకటనలతో దడపుట్టించడం తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా అణ్వాయుధాలు ప్రయోగిస్తే ఏర్పడే నష్టం ఏ స్థాయిలో ఉంటుందన్న చర్చ గత రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కొన్ని దేశాల మధ్య నెలకొన్న తీవ్ర అణ్వాయుధ పోటీ ఈ భయాలను నెక్ట్స్ రేంజ్‌కి చేర్చాయి. అయితే పొరుగు దేశం చైనా మాత్రం అణ్వాయుధ దాహంతో ఎగిరెగిరిపడుతుండటం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేసే అంశం. అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగితే.. అది సృష్టించే నష్టం మాటలకు, ఊహలకు అందనిది. అణుబాంబు ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో…. హిరోషిమా, నాగసాకి నగరాలను చూస్తేనే అర్థమవుతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో న్యూక్లియర్ బాంబుల ప్రయోగం మిగిల్చిన వినాశనం అంతా ఇంతాకాదు. అయినా ఇప్పుడు ఇలాంటి వినాశనాన్ని సృష్టించేందుకే…కొన్ని డర్టీ కంట్రీస్ కుట్రలు పన్నుతున్నాయి. రహస్యంగా అణు ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. ఆసియాలో చైనా, పాకిస్థాన్‌కు ధీటుగా భారత్ వంటి దేశాలు కూడా ఆత్మరక్షణ కోసం వ్యూహాత్మకంగా న్యూక్లియర్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి