Falcon Smuggle: కోట్లు పలుకుతున్న గద్దలు.. అరబ్ దేశాల్లో మంచి డిమాండ్ .. అక్కడి నుంచే ఎందుకు స్మగ్లింగ్ అవుతున్నాయో తెలుసా..?

|

Mar 23, 2021 | 5:09 PM

ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉన్న డేగలకు పాకిస్తాన్ బ్లాక్ మార్కెట్‌గా మారింది. ఇక్కడి నుంచి అరబ్ దేశాలను తరలించే ఒక్కో పక్షి విలువ రూ.4 లక్షల నుంచి 12 లక్షల వరకు ఉంటుంది.

Falcon Smuggle: కోట్లు పలుకుతున్న గద్దలు.. అరబ్ దేశాల్లో మంచి డిమాండ్ .. అక్కడి నుంచే ఎందుకు స్మగ్లింగ్ అవుతున్నాయో తెలుసా..?
Falcon Pakistan To Dubai
Follow us on

Pakistani Smuggle: అరబ్ దేశాలతో పాకిస్తాన్ సంబంధాల గురించి ప్రపంచమంతా తెలుసు. ఈ రెండు దేశాల మధ్య చమురుతోపాటు మరో అక్రమ బంధం కూడా ఉంది. అదే పక్షుల అక్రమ రవాణ… ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఈగిల్ పక్షులను అక్రమ మార్గంలో తరలిపోతుంటాయి. వీటిని తరలిస్తున్నవారు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారుతుంటారు. అయితే ఈ రెండు దేశాల మధ్య  ఈ పక్షి వీరి సంబంధాన్ని మరింత బలోపేతం చేయడంలో పెద్ద భూమిక పోషిస్తోంది.

పాకిస్తాన్ స్మగ్లర్స్.. 

వాస్తవానికి, అరబ్ దేశాలకు హాక్స్ అక్రమ రవాణాకు పాకిస్తాన్ ప్రధాన మార్గం . ఈగిల్ వంటి విలువైన పక్షిని పట్టుకుని అరబ్ షేక్‌లకు అప్పగిస్తున్నారు. ఇలా లక్షల్లో అరబ్ దినార్లు సొంతం చేసుకుంటున్నారు. ఈ అక్రమ రవాణ ఈగల్స్‌కు ముప్పు తెచ్చిపెట్టింది. పెద్ద ఎత్తున ఈగిల్ స్మగ్లింగ్ చేస్తున్న వేటగాళ్ళను ధనవంతులు మార్చుతోంది. కానీ దాని ఉనిని సంక్షోభంలోకి నెడుతోంది. డేగతో పాటు, అలాంటి కొన్ని పక్షులను కూడా అక్రమంగా రవాణా ఇక్కడి నుంచే జరుగుతోంది.

పాకిస్తాన్‌లో ఒక డేగ అమ్మినందుకు వేటగాళ్ళకు మిలియన్ డాలర్ల వరకు ముట్టజెప్పుతున్నారు అరబ్ షేకులు. ఈ హాక్స్ బ్లాక్ మార్కెట్‌కు పంపబడుతాన్నాయి. వేలాది మంది డీలర్లు కరాచీకి వచ్చి అక్కడి నుంచి ఈ స్మగ్లర్లను కలుస్తుంటారు. ఇలా వారి మధ్య పెద్ద ఎత్తున డీల్స్ కుదురుతుంటాయి. దీంతో అక్రమ రవాణాదారులకు ఏదైనా డేగా కనిపించడంతోనే వాటిని పట్టుకుని వారికి అప్పగిస్తుంటారు. డేగను పట్టుకోవటానికి ఈ వేటగాళ్లు అనేక వారాల పాటు పాకిస్తాన్‌లోని దట్టమైన అరణ్యాల్లో సంచరిస్తుంటారు.

ఈగల్స్‌కు చాలా మంచి ధర…

పాకిస్తాన్‌లో ఈగల్ వ్యపారం వేగంగా విస్తరిస్తోంది. ఇక్కడి స్మగ్లర్లు అడవుల్లోకి అధికారికంగా అడుగుపెడతారు.ముందుగా వాటికి ఆహారం అందించే నెపంతో అక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత వాటిన బంధించి దేశం దాటించేందుకు ప్లాన్ చేసుకుంటారు. అయితే.. పాకిస్తాన్‌లో ఈగిల్ వేట అధికారికంగా నిషేధించబడింది. కానీ అరేబియా దేశాల్లో వీటికి మంచి డిమాండ్ ఉండటంతో అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు అక్కడివారు.

అయితే ఇక్కడ జరుగుతున్న అక్రమ వ్యాపార వివరాలు పాకిస్తాను ప్రభుత్వాన్ని హెచ్చరించింది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఆర్గనైజేషన్. ఒక అంచనా ప్రకారం పాకిస్తాన్‌లో ప్రతి సంవత్సరం 700 నుండి 1000 ఈగల్స్ చట్టవిరుద్ధంగా దేశం దాటుతున్నాయి. తరచుగా ఈ స్మగ్లింగ్ వ్యవస్థీకృత నేరం ద్వారా జరుగుతుంది.

పాకిస్తాన్‌లో ఇదో పెద్ద వ్యాపారం…

ఎక్కువగా అరుదైన గుడ్లగూబలు, వాటి గుడ్లు, అరబ్ దేశాల్లో బాగా డిమాండ్ ఉంది. ఆ తరువాత వీటిని నల్లబజారులో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని రకాల డేగలు, గద్దలు, గుడ్లగూబలను పెంచుకోవడం దర్పంగా భావించే సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాలకు ఇలాంటి విలువైన జీవ సంపదను స్మగ్లింగ్ చేస్తున్నారు.

ఇది దొరికితే రూ.75 లక్షలు..

‘గ్రేట్ గ్రే’ రకం గుడ్లగూబలైతే సుమారు 1,12,000 డాలర్లు (భారతీయ కరెన్సీలో 75 లక్షల రూపాయల పైమాటే) ధర పలుకుతున్నాయని స్వీడన్ పోలీసులు చెబుతున్నారు.

డేగను సొంత పిల్లలా..

ఈ హాక్స్ గల్ఫ్ దేశాలకు చేరుతాయి. అక్కడ వీటిని విలువైన ఆస్తులుగా పరిగణించబడతాయి. అబుదాబిలోని ఫాల్కన్ హాస్పిటల్ డైరెక్టర్ మార్గీట్ మూలార్ అంచనా ప్రకారం పక్షుల యజమానులు వాటిని తమ పిల్లలలాగే పెంచుతుంటారని తెలిపారు. ఈ ఆసుపత్రిలో ప్రతి సంవత్సరం 11,000 ఈగల్స్ చికిత్స పొందుతున్నాయని వెల్లడించారు. ఇది గత పదేళ్లలో రెట్టింపు అయిన సంఖ్య అని పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం శీతాకాలంలో గల్ఫ్ ప్రాంతం నుండి వచ్చిన ప్రజలు పాకిస్తాన్ ఎడారి ప్రాంతాల్లో  విందులు చేసుకుంటారు. ఇక్కడ వారుకి బాజాను వేటాడేందుకు అనుమతిస్తారు. ఒక అరేబియాలోనే  సుమారు 500 నుంచి 600 డేగ పక్షులు ఉన్నాయని వన్యప్రాణుల సంరక్షణ సంస్థ తెలిపింది. వీరంతా పాకిస్తాన్ నుంచి తెప్పించుకుంటారని తెలిపింది. పాకిస్తాన్ నుంచే కాకుండా మంగోలియా నుంచి కూడా తెప్పించుకుంటారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: Special Status To AP: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేం… తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం..

ఈ మద్యం కంపెనీలో పని చేస్తే.. నెలకు రూ. 7 లక్షలు జీతమిస్తారట.. ఇంతకీ పనేంటంటే.!