HIV-AIDSVaccine: ఎయిడ్స్ కు వ్యా‌క్సిన్ క‌నుగొన్న ప‌రిశోధ‌కులు..! ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

|

Jul 14, 2022 | 1:31 PM

ఈ వ్యాధి వ్యక్తిని సమాజం నుండి వేరు చేస్తుంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్-19 మహమ్మారి కథ కాదు.

HIV-AIDSVaccine: ఎయిడ్స్ కు వ్యా‌క్సిన్ క‌నుగొన్న ప‌రిశోధ‌కులు..! ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Hiv Aidsvaccine
Follow us on

HIV-AIDSVaccine: ఆ వ్యాధి పేరు వింటేనే జనం వణికిపోతారు. ఇక అలాంటి వ్యాధి మీకే ఉందని తెలిస్తే, ప్రపంచం మిమ్మల్ని చూసే విధానం మారుతుంది. ఈ వ్యాధి వ్యక్తిని సమాజం నుండి వేరు చేస్తుంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్-19 మహమ్మారి కథ కాదు. సామాన్య మనుషులుండే సమాజం నుండి వెలివేసినట్టుగా బతుకుతున్న మనుషులు, రోజూ చావు దినాలు లెక్కపెట్టుకుంటూ కాలం గడిపేస్తూ, మృత్యువు అంచున నిలబడి జీవితం గురించి కలలు కంటూ సాగే కథ ఇది. అది మరెవరో కాదు ఎయిడ్స్ రోగులే. ఇప్పుడు ఆ ఎయిడ్స్ రోగులకు కూడా సంతోషాన్ని కలిగించే ఒక సంతోషకరమైన వార్త ఇది.

ఒకప్పుడు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఎయిడ్స్ వ్యాధికి మందు కూడా కనిపెట్టారు. HIV సంక్రమణ నుండి ప్రజలను ఎలా సురక్షితంగా ఉంచాలి అనే ప్రశ్నకు వైద్య పరిశోధన సమాధానం కనుగొంది. ఎయిడ్స్ మందుపై వైద్య పరిశోధన ఎలా జరిగింది?, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను మృత్యు ఒడి నుంచి గట్టెక్కించేందుకు ఆ సంజీవని మందు ఏది..? పరిశోధన చేసిన మందు ఎయిడ్స్ రోగుల్లో ఎలా పనిచేస్తుందనే పలు అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎయిడ్స్ వ్యాధిపై ఇజ్రాయెల్ పరిశోధకులు విజయం సాధించారు. జన్యు సవరణ ద్వారా హెచ్ఐవి-ఎయిడ్స్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగే టీకాను అభివృద్ధి చేసినట్టు ఇజ్రాయెల్‌కు చెందిన టెల్ అవీవ్ వర్సిటీ పరిశోధకుల బృందం ప్రకటించింది. వైద్య రంగంలోనే ఇది అద్భుత‌మ‌ని నిపుణులు చెప్తున్నారు. హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. దీనికి సరైన చికిత్స కనుక తీసుకోకపోతే అది అక్వైర్డ్ ఇమ్యునో డిఫిషియెన్సీ సిండ్రోమ్ (AIDS)కి దారి తీస్తుంది. అయితే ఎయిడ్స్‌పై ఎన్నోరకాల పరిశోధలు జరిగినప్పటికీ దీనికి శాశ్వతంగా చెక్‌చెప్పే ఔషధం ఇప్పటివరకు రాలేదు. అయితే టెల్ అవీవ్ యూనివర్సిటీలోని ది జార్జ్ ఎస్ వైజ్ ఫ్యాకల్టీ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లోని స్కూల్ ఆఫ్ న్యూరోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్ పరిశోధకుల బృందం దీనిపై పరిశోధన నిర్వహించింది. టైప్- బి తెల్ల రక్త కణాల ద్వారా అభివృద్ధి చేసిన ఒకే టీకాతో వైరస్‌ను న్యూట్రలైజ్ చేయడంలో వారు విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి

హెఐవీని న్యూట్రలైజ్ చేసే ప్రతిరోధకాలను ఈ టీకా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థను తిరిగి యాక్టివ్‌గా మారుస్తుంది. పరిశోధనలో భాగంగా చికిత్స తీసుకున్న కొందరి రక్తంలో కావాల్సినన్ని యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. ఈ పరిశోధన విజయవంతం కావడంతో భవిష్యత్తులో ఎయిడ్స్‌కు మందులు కూడా ఉత్పత్తి చేస్తామని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. తాము చికిత్స అందించిన అన్ని ల్యాబ్ మోడళ్లు బాగా ప్రతిస్పందించాయని, వారి రక్తంలో కావాల్సిన యాంటీబాడీని అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయగలిగామని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ బార్జెల్ వివరించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి