అఖండ భారత దేశం నుంచి పాకిస్తాన్ నుంచి విడిపోయిన తర్వాత అనేక ప్రసిద్ధి హిందూ దేవాలయాలు ఆ దేశంలో ఉన్నాయి. అయితే వాటి పోషణ లేక కాలక్రమంలో కొన్ని ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. తాజాగా పాకిస్థాన్ ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలో ఓ హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. దీని స్థానంలో వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ నిర్మాణ పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి విషయాన్నీ ఓ జర్నలిస్టు బయట పెట్టడంతో ప్రపంచానికి తెలిసింది.
ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఒక చారిత్రక దేవాలయం ఉంది. భారతదేశం-పాకిస్థాన్ విభజన తర్వాత ఈ ఆలయాన్ని మూసివేశారు. ఇప్పుడు ఈ ఆలయాన్ని కూల్చివేసి ప్రస్తుతం ఇక్కడ వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయమై పాక్ జర్నలిస్టు ఇబ్రహీం షిన్వారీ మాట్లాడుతూ.. కోటల్ బజార్‌లో ఓ దేవాలయం ఉండేదని చెప్పారు. విభజన తర్వాత స్థానిక హిందువులు భారతదేశానికి తరలి వెళ్లారు. అనంతరం ఈ ఆలయాన్ని మూసివేశారు.
1992లో అయోధ్యలో వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేసినప్పుడు కొందరు వ్యక్తులు ఆలయాన్ని ధ్వంసం చేశారని అన్నారు. అంతేకాదు ఆయన తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆలయానికి సంబంధించిన కథలు విన్నామని గుర్తు చేసుకున్నారు. మరోవైపు ముస్లిమేతరుల మతపరమైన ప్రాముఖ్యత కలిగిన చారిత్రక కట్టడాలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పాకిస్థాన్ హిందూ దేవాలయ నిర్వహణ కమిటీ హరూన్ సర్బాడియాల్ అన్నారు.
అదే సమయంలో లాండి కొటాల్ మార్కెట్‌లోని పాత దుకాణాల మరమ్మతులకు బిల్డర్‌కు ఎన్‌ఓసి జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఖైబర్ జిల్లాలో తమ వద్ద ప్రామాణికమైన, క్రమబద్ధమైన రెవెన్యూ రికార్డులు లేవని అధికారులే అంగీకరించడం ఆశ్చర్యకరం.
ఆలయ స్థలంలో నిర్మాణం గురించి తనకు తెలియదని లాండి కోటల్‌కు చెందిన పట్వారీ జమాల్ అఫ్రిది అన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఆ స్థలంలో ఏ ఆలయం ఉన్నట్లు ఎటువంటి ప్రస్తావన లేదని చెప్పారు. మతపరమైన మైనారిటీల పట్ల ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైతే.. దేశంలోని అన్ని ప్రార్థనా స్థలాలు, చారిత్రక కట్టడాలు కనుమరుగవుతాయని ఆయన అన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..