Helicopter Crash: హడ్సన్‌ నదిలో కూలిన హెలికాప్టర్, ఫ్యామిలీతో సహా టెక్‌ కంపెనీ సీఈవో మృతి!

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. న్యూయార్క్‌లో ఓ పర్యాటక హెలికాప్టర్ ప్రమాదవశాత్తు గింగిరాలు కొడుతూ నదిలో కుప్పకూలింది. ప్రమాదంలో ఓ టెక్‌ కంపెనీకి చెందిన సీఈవో, అతని ఫ్యామిలీ ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Helicopter Crash: హడ్సన్‌ నదిలో కూలిన హెలికాప్టర్, ఫ్యామిలీతో సహా టెక్‌ కంపెనీ సీఈవో మృతి!
Helicopter Crash

Edited By:

Updated on: Apr 12, 2025 | 6:15 PM

New York: జర్మనీకి చెందిన ఓ దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీఈవో అగస్టన్‌ ఎస్కోబార్‌ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా సిటీ చూసేందుకు వారు హెలికాప్టర్‌లో బయల్దేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్‌ నది మీదుగా వెళ్తుండగా ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. గాల్లోనే గింగిరాలు కొడుతూ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎస్కోబార్‌, ఆయన భార్య, ముగ్గురు పిల్లలతో పాటు పైలట్‌ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి బోట్ల సాయంతో ఘటనా స్ధలంలో సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ తలకిందులుగా పడడంతో పూర్తిగా నీటిలో కూరుకుపోయినట్టు అధికారులు తెలిపారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్‌లోని ఒక భాగం విరిగిపోయినట్టు తెలిపారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ బెల్ 206 చాపర్‌ను న్యూయార్క్ టూర్స్ విభాగం సైట్ సీయింగ్ కోసం వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ ప్రమాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అగస్టన్‌, ఆయన కుటుంబసభ్యుల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…