Coronavirus vaccine distribution: ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరు కొనసాగుతోంది. కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ని కనుగొనే పనిలో చాలా దేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి. అయితే కరోనాకు వ్యాక్సిన్ వస్తే దాని పంపిణీ ఎలా చేయాలి..? టీకా డోసులు ఎవరికి ముందు ఇవ్వాలన్న చర్చ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. దీనిపై మాట్లాడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. అన్ని దేశాలకు ప్రాధాన్యతను ఇస్తూ వ్యాక్సిన్ పంపిణీ చేయాలని సూచించింది. లేకపోతే చాలా దేశాలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
ఇదిలా ఉంటే కరోనా ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు, ఎవరిపై ఎక్కువగా వైరస్ ప్రభావం ఉంటుంది, మరణాల నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకున్న కొంతమంది అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు వ్యాక్సిన్ పంపిణీపై ఓ విధానాన్ని రూపొందించారు. దీనిపై పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన ఎజెకీల్ జే ఎమ్మాన్యూల్ నేతృత్వంలోని నిపుణులు మూడు దశల్లో వ్యాక్సిన్ ఎలా పంపిణీ చేయాలో సూచనలు చేశారు. అందులో భాగంగా కరోనా వైరస్‌తో అత్యధికంగా మరనాలు సంభవించే దేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని వారు తెలిపారు. ఊహించిన దానికంటే ఎక్కువ మరణాలు నమోదయ్య ప్రాంతాలను గుర్తించి టీకాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక వైరస్‌తో పోరాడుతూనే ఆర్థికంగా ముందుకు వెళుతున్న దేశాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలని వారు తెలిపారు. దీని వలన కరోనాతో ఏర్పడిన పేదరికాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వివరించారు. ఇక వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలని ఆ నిపుణులు వెల్లడించారు.
Read More: