చీ..చీ.. ఇతనేం మనిషిరా దేవుడా..! నీళ్లంటే భయంతో ఏళ్ల తరబడి స్నానం చేయకుండానే.. చివరకు..

|

Jun 12, 2023 | 7:46 AM

అము హాజీ అనే వ్యక్తి ఈ ప్రపంచంలోనే అత్యంత నీచమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. సబ్బు, నీటిని తాకకుండా ఒక దాదాపు 100ఏళ్ల వరకు జీవించాడు. తన జీవితంలో అతిగా ధూమపానం చేసేవాడు. అతనికి ఇష్టమైన ఆహారం పంది మాంసం. దాంతో స్థానికులు అతన్ని స్నానం చేయాలంటూ వెంటపడ్డారు. ఎట్టకేలకు అతడు..

చీ..చీ.. ఇతనేం మనిషిరా దేవుడా..! నీళ్లంటే భయంతో ఏళ్ల తరబడి స్నానం చేయకుండానే.. చివరకు..
Ugliest Man 1
Follow us on

ఎవరైనా స్నానం చేయకుండా ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి..? స్నానం చేయకుండా ఉండటమనే మాటకే ఛీ అనిపిస్తుంది.! అలాంటిది ఎన్ని రోజులు స్నానం చేయకుండా ఉంటారు అనే మాట మరింత విరక్తిని కలిగిస్తుంది. అలాంటిది ఒక వ్యక్తి ఏళ్ల తరబడి స్నానం చేయకుండానే ఉన్నాడు. దక్షిణ ప్రావిన్స్ ఫార్స్‌లోని ఇరానియన్‌లో నివసించిన అము హాజీ అనే వ్యక్తి ఈ ప్రపంచంలోనే అత్యంత నీచమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. సబ్బు, నీటిని తాకకుండా ఒక శతాబ్దానికి పైగా జీవించాడు. అది తమ అనారోగ్యానికి దారితీస్తుందని భయపడ్డారు. అతడికి స్నానం చేయించేందుకు చుట్టుపక్కల వారు రకరకాలుగా ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు.

అము హాజీ తన జీవితంలో అతిగా ధూమపానం చేసేవాడు. అతనికి ఇష్టమైన ఆహారం పంది మాంసం. అతను దేజ్గా గ్రామంలో భూమిలో ఒక సొరంగం లాంటిది నిర్మించుకుని అందులోనే ఉండేవాడు. ఆ వ్యక్తి చాలా సంవత్సరాలుగా స్నానం చేయలేదట. అతని చర్మం నల్లగా చూస్తే అసహ్యం పుట్టేలా తయారైంది. దాంతో స్థానికులు అతన్ని స్నానం చేయాలంటూ వెంటపడ్డారు. ఎట్టకేలకు అతడు.. తన స్థానికుల ఒత్తిడికి లొంగిపోయాడు. స్నానం చేసిన నెలలోనే మరణించాడు. అయితే, తను ఇలా సబ్బు, నీళ్లకు దూరంగా ఉండడానికి కారణం ఎవరో తనకు హాని కలుగుతుందని చెప్పారట. దాంతో అతడు మనసులో తెలియని భయం పెట్టుకున్నాడు. ఆ భయం కారణంగానే అతను ఇంతకాలం స్నానం చేయకుండా ఉండిపోయాడు. కాకపోతే తాగడానికి, స్నానానికి మంచినీళ్లు ఇవ్వడం వల్లే అతను చనిపోయాడని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. స్నానం చేయకుండా ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి అము హాజీ అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అదేవిధంగా, భారతీయ సంతతికి చెందిన వ్యక్తి పళ్ళు తోముకోకుండా 35 సంవత్సరాలు జీవించినట్లు సమాచారం. ఆ తర్వాత అతనికి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి