Happy New Year 2025: ఆ దేశంలో కొత్త ఏడాదికి కలర్‌ఫుల్‌గా స్వాగతం.. వేడుకలు చూస్తే మైమరిచిపోవాల్సిందే..

|

Dec 31, 2024 | 5:12 PM

పసిఫిక్‌ సముద్రంలోని కిరిబాటి దీవి ప్రజలు అందరికంటే ముందుగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకే వాళ్లకు న్యూఇయర్‌ మొదలైపోయింది. కిరిబాటి దీవి తర్వాత న్యూజిలాండ్‌ కూడా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఆక్లాండ్‌ స్కై టవర్‌ బాణాసంచా పేలుళ్లతో వెలిగిపోయింది..

Happy New Year 2025: ఆ దేశంలో కొత్త ఏడాదికి కలర్‌ఫుల్‌గా స్వాగతం.. వేడుకలు చూస్తే మైమరిచిపోవాల్సిందే..
Happy New Year 2025
Follow us on

ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్‌ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.. న్యూజిలాండ్‌ లోని ఆక్లాండ్‌ నగరం 2025 లోకి ప్రవేశించింది. సరిగ్గా 12 గంటలకు అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వేడుకలు నిర్వహించుకుున్నారు.. ఈ సందర్భంగా ఫైర్‌ వర్క్స్‌ షో ఆకట్టుకుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం ఆక్లాండ్‌కు భారీగా టూరిస్టులు తరలివచ్చారు. ఆక్లాండ్‌ స్కై టవర్‌ బాణాసంచా పేలుళ్లతో వెలిగిపోయింది..

పసిఫిక్‌ సముద్రంలోని కిరిబాటి దీవి ప్రజలు అందరికంటే ముందుగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకే వాళ్లకు న్యూఇయర్‌ మొదలైపోయింది. కిరిబాటి దీవి తర్వాత న్యూజిలాండ్‌ కూడా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. భారతీయ కాలమాన ప్రకారం 4.30 గంటలకు వాళ్లకు కొత్త సంవత్సరం మొదలయ్యింది. అద్భుతమైన ఫైర్‌వర్క్స్‌, హోరెత్తించే మ్యూజిక్‌తో ఆక్లాండ్‌ ప్రజలు న్యూఇయర్‌కు వెల్‌కమ్‌ చెప్పారు.

వీడియో చూడండి..

న్యూజిలాండ్‌ తర్వాత ఆస్ట్రేలియాలో కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది. అక్కడ సాయంత్రం 6:30 గంటలకు న్యూఇయర్‌ మొదలవుతుంది. జపాన్‌, ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలో రాత్రి 8:30 గంటలకు, చైనా, మలేసియా, సింగపూర్‌, హాంకాంగ్‌, ఫిలిప్పీన్స్‌లో రాత్రి 9:30 గంటలకు, థాయ్‌లాండ్‌, వియత్నాం, కాంబోడియాలో రాత్రి 10:30 గంటలకు న్యూఇయర్‌ మొదలవుతుంది.

భారత్‌ తర్వాత 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్‌, ఇటలీ లాంటి ఐరోపా దేశాలతోపాటు కాంగో, అంగోలా, కామెరూన్‌ లాంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. అయితే, చివరిగా అమెరికానే న్యూఇయర్‌కు స్వాగతం పలుకుతుంది.

లైవ్ వీడియో ..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..