AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్.. మోదీ దౌత్య వ్యూహానికి రష్యా, అమెరికాలు ఫిదా..

అటు రష్యా.. ఇటు అమెరికా.. ప్రపంచాన్ని శాసించే ఇద్దరు అగ్రనేతలు ఒకేసారి ఒకే గొంతుకతో భారత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తే ఎలా ఉంటుంది?" ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ యవనికపై సరిగ్గా ఇదే జరుగుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌ను ఒక నమ్మకమైన భాగస్వామిగా అభివర్ణించగా.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడు అని కొనియాడారు.

ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్.. మోదీ దౌత్య వ్యూహానికి రష్యా, అమెరికాలు ఫిదా..
Putin And Trump Praise Pm Modi
Krishna S
|

Updated on: Jun 05, 2026 | 10:41 AM

Share

అంతర్జాతీయ రాజకీయ యవనికపై భారతదేశం అత్యంత శక్తిమంతమైన దౌత్య దేశంగా దూసుకుపోతోంది. అటు రష్యా, ఇటు అమెరికా.. ప్రపంచాన్ని శాసించే ఇద్దరు అగ్రనేతలు ఒకేసారి భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని ఒక నమ్మకమైన భాగస్వామిగా అభివర్ణించగా.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తన మంచి మిత్రుడుగా కొనియాడారు.

భారత్ ఒక నమ్మకమైన శక్తే…

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంతర్జాతీయ వేదికపై పశ్చిమ దేశాల తీరును తీవ్రంగా ఎండగట్టారు. ప్రపంచ వ్యవహారాల్లో పశ్చిమ దేశాల జోక్యం హానికరంగా మారిందని ఆయన మండిపడ్డారు. ఇదే సమయంలో భారతదేశాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతర్జాతీయ ఒత్తిళ్లు, పశ్చిమ దేశాల ఆంక్షలు ఎన్ని ఉన్నప్పటికీ రష్యాతో భారత్ తన బంధాన్ని బలంగా కొనసాగిస్తోందని, ఇండియా ఎప్పుడూ ఒక నమ్మకమైన భాగస్వామి అని పుతిన్ స్పష్టం చేశారు. పశ్చిమ దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర దేశాల సార్వభౌమత్వంలో జోక్యం చేసుకుంటున్నాయని, ఇటువంటి చర్యలు అంతర్జాతీయ శాంతికి విఘాతం కలిగిస్తాయని పుతిన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అవలంబిస్తున్న భారత్ వైఖరిని ఆయన కొనియాడారు.

మోదీ గుడ్ ఫ్రెండ్ అన్న ట్రంప్

మరోవైపు పన్నుల విధింపు విషయంలో భారత్‌తో సహా పలు దేశాలకు హెచ్చరికలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వైట్ హౌస్ నివేదికల ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ తనకు అత్యంత ఆప్తుడైన ఒక మంచి మిత్రుడు అని ట్రంప్ అభివర్ణించారు. మోదీ నాయకత్వాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. భారత్, అమెరికా దేశాల మధ్య టారిఫ్ వివాదాలు నడుస్తున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య త్వరలోనే ఒక పెద్ద ట్రేడ్ డీల్ కుదరబోతోందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర ప్రయోజనాల ఆధారంగా ఈ ఒప్పందం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఇద్దరు అగ్రనేతల మధ్య భారత్ బ్యాలెన్సింగ్ యాక్ట్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచం రెండు ధృవాలుగా విడిపోయిన తరుణంలో.. అటు అమెరికాతోనూ, ఇటు రష్యాతోనూ సమానమైన దౌత్య బంధాన్ని కొనసాగించడం భారతదేశానికే సాధ్యమైందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తూనే.. మరోవైపు అమెరికాతో రక్షణ, ఐటీ, వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యాన్ని భారత్ పటిష్టం చేసుకుంటుది. టారిఫ్ బెదిరింపులు ఉన్నప్పటికీ, మోదీతో ఉన్న వ్యక్తిగత సంబంధాలు, భారతదేశ ఆర్థిక శక్తిని అమెరికా విస్మరించలేదు అనడానికి ట్రంప్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.

Follow Us