America: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకి పేలింది. ఏడవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై చేసిన కాల్పుల ఘటన సౌత్ కారోలీనాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని సౌత్ కారోలీనా టాంగిల్ వుడ్ స్కూల్‌లో ఏడవ తరగతి చదువున్న ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై కాల్పులు జరిపాడు. దీంతో కాల్పుల శబ్ధం విన్న వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను సురక్షితంగా దగ్గరల్లోని చర్చికి తరలించారు. ఈ దాడిలో ఓ విద్యార్థి మరణించాడు. విషయం తెలసుకున్న గ్రీన్ విల్లే కౌంటీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కాల్పులు జరిపిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ కాల్పులు జరుగుతున్న సమయంలో తెలుగు రాష్ట్రానికి చెందిన కోనేరు శ్రీధర్ 20 మంది విద్యార్థులను కాపాడారు. కాల్పులు జరిగినట్లు తెలుసుకున్న వెంటనే శ్రీధర్ తన తరగతి గదిలో ఉన్న 20 మంది విద్యార్థులను బెంచిల కింద కూర్చోబెట్టి తలుపులు మూసేశారు. ఇలా విద్యార్థుల ప్రాణాలను కాపాడారు. విజయవాడకు చెందిన కోనేరు శ్రీధర్ టాంగిల్ వుడ్ స్కూల్‌లో గత కొన్నేళ్లుగా మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు.
ఎంతో చాకచక్యంగా వ్యవహరించి విద్యార్థుల ప్రాణాలను కాపాడిన శ్రీధర్‌ను తోటి సిబ్బంది, అభినందించారు. ఇక తమ పిల్లలను కాపాడినందరకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో కాల్పులు జరిగాయన్న విషయం తెలసుకున్న వెంటనే విద్యార్థుల పేరెంట్స్ పాఠశాల వద్దకు చేరుకున్నారు.
ICICI Bank: వడ్డీ రేట్లని పెంచిన ఐసీఐసీఐ.. కొత్త రేట్లు ఏంటో తెలుసుకోండి..!