బ్రిటన్ లో జరిగిన షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ దేశానికి చదువుకోసం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి మద్యం మత్తులో ఉన్న మహిళను తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. బీబీసీ కథనం ప్రకారం అత్యాచారం చేసిన భారతీయ విద్యార్థి పేరు ప్రీత్ వికల్. 20ఏళ్లు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఈ షాకింగ్ సంఘటన కార్డిఫ్‌లో జరిగింది. ఓ మహిళ మద్యం మత్తులో ఉంది. ఆ మహిళను వికల్ తన చేతుల్లో ఎత్తుకుని ఎక్కడికో తీసుకెళ్తున్నట్లు వీడియో ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మహిళను తన ప్లాట్ కు తీసుకుని వెళ్లి వికల్ అత్యాచారం చేసినట్లు స్థానిక పోలీసులు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసుని విచారించారు. వికల్ తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి ఆరేళ్ల తొమ్మిది నెలల జైలుశిక్ష పడింది.
బాధితురాలి కథనం ప్రకారం..
రాత్రి సమయంలో తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లినపుడు ప్రీత్ వికల్‌ను కలిసినట్లు బాధిత మహిళ చెప్పింది. రాత్రి తన స్నేహితుల నుంచి విడిపోయి.. ఇంటికి వెళ్తున్న సమయంలో వికల్ తనను పట్టుకున్నట్లు.. అప్పుడు తాను మద్యం మత్తులో ఉన్నానని తెలిపింది. అనంతరం తనను నార్త్‌రోడ్‌లోని ఫ్లాట్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి తనకు నిద్ర పట్టడం లేదని చెప్పింది బాధితురాలు.
Chilling CCTV captures moment Indian student, who won scholarship to study in UK, carried a drunk, semi-conscious woman back to his flat before raping her and sending ‘trophy photo’ of her sprawled on his bed to a friend.
Preet Vikal, 20, was sent to a young offenders… pic.twitter.com/QqcuwP92VY
— ?? The Aussie Hun♀?? (@TheAussieHun) June 16, 2023
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వికాల్‌ను గుర్తించిన పోలీసులు
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రీత్ వికల్‌ను గుర్తించి అరెస్ట్ చేశామని సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. అంతేకాదు కార్డిఫ్‌లో ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతాయన్నారు. అంతేకాదు వికల్ UKలో చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌ను గెలుచుకున్నాడని.. ఈ ఘటనతో స్వయంగా జీవితాన్ని కటకటాల పాలు చేసుకున్నాడని తెలిపారు. యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..