Preet Chandi: అంటార్కిటికాలో సోలో యాత్రను పూర్తి చేసి రికార్డు సృష్టించిన ప్రీత్ చందీ.. 

అంటార్కిటికాలో సోలో యాత్రను పూర్తి చేసిన మొదటి మహిళగా భారత సంతతికి చెందిన ప్రీత్ చందీ చరిత్ర సృష్టించారు.

Preet Chandi: అంటార్కిటికాలో సోలో యాత్రను పూర్తి చేసి రికార్డు సృష్టించిన ప్రీత్ చందీ.. 
Chandi
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 05, 2022 | 6:49 AM

అంటార్కిటికాలో సోలో యాత్రను పూర్తి చేసిన మొదటి మహిళగా భారత సంతతికి చెందిన ప్రీత్ చందీ చరిత్ర సృష్టించారు. ఆమె కేవలం 40 రోజుల్లో 700 మైళ్లు ప్రయాణించారు. భారతీయ సంతతికి చెందిన ఒక బ్రిటీష్ ఆర్మీ అధికారి ప్రీత్ చందీ 90 కిలోలు స్లెడ్, కిట్, ఇంధనం, ఆహారాన్ని మోసుకెళ్లారు.

బ్రిటీష్‌లో జన్మించిన సిక్కు ఆర్మీ అధికారి ప్రీత్ చాందీ దక్షిణ ధృవానికి గత సంవత్సరం నవంబర్‌లో ప్రయాణం ప్రారంభించారు. ఆమె కొన్ని వారాలుగా అంటార్కిటికా అంతటా ఒంటరిగా స్కీయింగ్ చేస్తున్నారు.  జనవరి 3న 700 మైళ్ల (1126 కి.మీ) ట్రెక్‌ను 40 రోజుల్లో పూర్తి చేసినట్లు ప్రకటించారు. “నేను మంచు కురుస్తున్న దక్షిణ ధ్రువానికి చేరుకున్నాను” అని చాందీ తన బ్లాగ్‌లో ప్రకటించారు. “ప్రస్తుతం చాలా భావోద్వేగానికి గురయ్యాను” అని “పోలార్ ప్రీత్”గా పేరు పొందిన 32  ప్రీత్ చెప్పారు.

“అంటార్కిటికా భూమిపై అత్యంత శీతలమైన, ఎత్తైన, పొడిగా, గాలులతో కూడిన ఖండం. అక్కడ ఎవరూ శాశ్వతంగా నివసించరు. నేను మొదట ప్లాన్ చేయడం ప్రారంభించినప్పుడు ఆ ఖండం గురించి నాకు పెద్దగా తెలియదు. అదే నన్ను అక్కడికి వెళ్లడానికి ప్రేరేపించింది” అని చాందీ చెప్పారు.

Read Also.. Ashok Elluswamy: మస్క్​’టీమ్’లో భారత సంతతి ఇంజినీర్.. వెల్లడించిన ​ఎలాన్ మస్క్..