ఫ్లోరిడా, ఆగస్టు 25: ప్రపంచ మాజీ స్టార్ ఛాంపియన్ బ్రే వ్యాట్ (36) అతి చిన్న వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) స్టార్ అయిన బ్రే వ్యాట్ గురువారం (ఆగస్టు 24) మృతి చెందారు. ఈ విషయాన్ని డబ్ల్యూడబ్ల్యూఈ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ పాల్ ‘ట్రిపుల్ హెచ్’ లెవెస్క్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. డబ్యూడబ్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్ మైక్ రోటుండా ఫోన్ చేసి బ్రే మరణ వార్త చెప్పారు. ఊహించని వార్త విన్నాను. బ్రే కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ గ్రే కుటుంబం గోప్యతను గౌరవించాలని కోరుతున్నామని చీప్ కంటెట్ ఆఫీసర్ పాల్ లెవెస్క్ ట్వీట్ చేశారు.
కేవలం 36 ఏళ్లకే గుండెపోటుతో మృతి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రే వ్యాట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. బ్రే ఆకస్మిక మరణం యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. కాగా బ్రే గత కొన్ని నెలలుగా రెజ్లింగ్‌కు దూరంగా ఉంటున్నారు. కొన్ని అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. వ్యాట్ అసలు పేరు ‘విండమ్ రొటిండా’. బ్రే 2009 నుంచి 2022 వరకు WWEలో కొనసాగారు. మూడు సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచ ఛాంపియన్‌గా బ్రే నిలిచారు.
Just received a call from WWE Hall of Famer Mike Rotunda who informed us of the tragic news that our WWE family member for life Windham Rotunda – also known as Bray Wyatt – unexpectedly passed earlier today. Our thoughts are with his family and we ask that everyone respect their…
— Triple H (@TripleH) August 24, 2023
Wow can’t believe it R.I.P 🙏💔 pic.twitter.com/2cZyeDRNsE
— Stephen 🏴 (@Stephen__NHS) August 24, 2023
డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌గా ఒకసారి, యూనివర్సల్ ఛాంపియన్‌షిప్ రెండు గెలిచారు. బ్రే కుటుంబంలో అతని తండ్రి హాల్ ఆఫ్ ఫేమర్ మైక్ రొటుండా, బ్రే తాత బ్లాక్‌జాక్ ముల్లిగన్ కూడా రెజ్లర్లు కావడం విశేషం. అలాగే బ్రే వంశంలో మరికొందరు రెజ్లర్లు ఉంటున్నారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బ్రే వ్యాట్ మూడవ తరం రెజ్లర్‌గా ఉన్నాడు. 2023 జనవరిలో జరిగిన రాయల్ రంబుల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో బ్రే చివరి సారిగా పాల్గొన్నారు. 2009లో మొదలైన బ్రే రెజ్లింగ్ ప్రయాణం ముగిసినట్లైంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.