Fire Accident: అమెరికాలో అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి!

Fire Accident: అమెరికాలో ఘోర అన్ని ప్రమాదం చోటు చేసుకుంది. బర్న్స్ విల్లేలో ఓ అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా కేకలు..

Fire Accident: అమెరికాలో అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి!

Updated on: Dec 05, 2025 | 9:56 PM

Fire Accident: అమెరికా అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అలబామా యూనివర్సిటీలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు నివసించే ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ మంటల్లో చిక్కుకుంది. ఫైర్ అలారమ్ మోగేలోగా మంటలు, దట్టమైన పొగ భవనం అంతటా అలుముకోవడంతో విద్యార్థులు శ్వాస తీసుకోలేక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఫైర్ సిబ్బంది మొత్తం 10 మంది విద్యార్థులను భవనం నుంచి బయటికి తీసుకొచ్చి, ఆస్పత్రికి తరలించారు. వారిలో తెలుగు ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఈ 10 మంది తెలుగు విద్యార్థులు బర్మింగ్‌హామ్ లోని అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదశాత్తు అర్ధరాత్రి హఠాత్తుగా మంటలు చెలరేగటంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారంఅయితే అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్లో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురైనట్లు తెలుస్తోంది. మృతి చెందిన విద్యార్థులు హైదరాబాద్ చెందిన వారని సమాచారం. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి