Peshawar crime: నకిలీ బాబా అమానుషం.. కడుపులో బిడ్డను అబ్బాయిగా మారుస్తానంటూ.. గర్భిణిని ఏం చేశాడంటే..

|

Feb 11, 2022 | 9:51 AM

ఆడా, మగా ఇద్దరూ సమానమేనని ప్రభుత్వాలు చెబుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు. పుట్టబోయే పిల్లల్లో లింగ సమతుల్యత సరిగా లేకపోవడంతో...

Peshawar crime: నకిలీ బాబా అమానుషం.. కడుపులో బిడ్డను అబ్బాయిగా మారుస్తానంటూ.. గర్భిణిని ఏం చేశాడంటే..
Peshawar Pregnent
Follow us on

ఆడా, మగా ఇద్దరూ సమానమేనని ప్రభుత్వాలు చెబుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు. పుట్టబోయే పిల్లల్లో లింగ సమతుల్యత సరిగా లేకపోవడంతో వారు మున్ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని వివరిస్తున్నా కొందరు ప్రబుద్ధులు వాటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా బ్రూణ హత్యలు, ఆడ శిశువులను చంపేయడం, దూరంగా పడేయడం, శిశు సంరక్షణ గృహాలకు అందిండం వంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. అయితే బిడ్డ కడుపులో ఉండగానే కొందరు తల్లిదండ్రులు ఆడ పిల్ల పుడుతుందేమోనని భయపడుతున్నారు. ఆడ పిల్ల పుడితే భారమంటూ నిర్దయగా గొంతు నులిమేస్తున్నారు. మగ పిల్లాడు పుట్టేందుకు చేయాల్సిన అన్ని పనులూ చేస్తున్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. మగ సంతానం కలిగేలా మందులు ఇస్తామని నమ్మించి నట్టేట ముంచుతున్నారు. తాజాగా కడుపులోని బిడ్డను మగ బిడ్డ గా మారుస్తానని ఓ దొంగ బాబా దారుణానికి ఒడిగట్టాడు. గర్భిణీ తలకు మేకు కొట్టి పరారయ్యాడు. ఈ ఘటన పాకిస్తాన్ లోని పెషావర్ లో జరిగింది.

కచ్చితంగా అబ్బాయి పుట్టాలంటే నదుటికి మేకు కొట్టుకోవాలని ఓ గర్భిణికి సూచించి, ఆమెను ప్రాణాపాయంలో పడేశాడు ఓ నకిలీ బాబా. పెషావర్‌(Peshawar)కు చెందిన మహిళకు ఇప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె గర్భిణి. మరోసారి అమ్మాయే పుడుతుందని చాలా భయపడేది. మగబిడ్డ పుట్టకపోతే వదిలేస్తానని ఆమె భర్త బెదిరించడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. నాలుగో కాన్పులోనూ అమ్మాయి పుడుతుందన్న ఆందోళనతో క్షణమొక యుగంలా గడుపుతున్న ఆ మహిళ.. పరిష్కారం కోసం చాలా ప్రయత్నించింది. చివరగా ఓ బాబా దగ్గరకు వెళ్లింది. ఆ నకిలీ బాబా ఓ అసాధారణమైన, ప్రాణాంతకమైన సలహా ఇచ్చాడు. నదుటిపై పదునైన మేకును దించితే.. గర్భంలో అమ్మాయి ఉన్నా అబ్బాయే పుడతాడని నమ్మించాడు.

అతడు చెప్పింది చేసేందుకు ఆ మహిళ సిద్ధపడింది. తన తలలోకి రెండు అంగుళాల మేకు దిగగానే నొప్పితో విలవిల్లాడిపోయింది. ఆ మేకును బయటకు లాగేందుకు ఆమె కుటుంబసభ్యులు విఫలయత్నం చేశారు. హుటాహుటిన బాధితురాలిని పెషావర్‌లోని ఆస్పత్రికి తరలించారు. న్యూరాలజిస్ట్‌ హైదర్‌ సులేమాన్‌ ఆమెకు చికిత్స చేశారు. ఆ మేకు పుర్రెలోకి చొచ్చుకెళ్లిందని, కానీ మెదడును తాకలేదని చెప్పారు. ఎందుకిలా చేశారో చెప్పడంతో షాక్‌కు గురయ్యారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. అయితే.. మహిళ తలలో మేకు ఉన్న ఎక్స్‌రే ఫొటో వైరల్‌ అయింది. ఇది అధికారుల దృష్టికి వెళ్లగా పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్పత్రికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నకిలీ బాబా కోసం గాలిస్తున్నారు.

Also Read

ఈ మేకకు ఏమైనా శక్తులున్నాయా ?? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్స్ !! వీడియో

వామ్మో.. వీడేందిరా బాబు ఇలా దూకేశాడు !!నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో

నేను 129 మంది పిల్లలకు తండ్రిని !! 150 మంది లక్ష్యం అంటున్న వ్యక్తి !! వీడియో