Worlds Richest People: ప్రపంచ అత్యంత సంపన్నుల లిస్ట్‌లో మోటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 2వ స్థానంలో నిలిచినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ రెండు స్థానంలో ఉండగా ఆయను మార్క్ జుకర్ వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. జుకర్‌బర్గ్ సంపద 206 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ సంపద 205 బిలియన్ డాలర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదికలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ 256 డాలర్ల బిలియన్ సంపదతో మొదటి స్థానంలో కొనసాగుతున్నట్లు చెప్పింది.
ఇక ఇండియా సంపన్నుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 107 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నట్లు, అతడు ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో 14వ స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. 100 బిలియన్ డాలర్లతో బిలియనీర్ గౌతమ్ ఆదానీ 17వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఈ మధ్య జుకర్ బర్గ్ కంపెనీ మెటా షేర్ల ధర పెరగడంతో సెకెండ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో జోరుగా వృద్ధి నమోదైంది. గురువారం 582.77 డాలర్ల వద్ద మెటా షేర్ల వాల్యూ ముగిసింది. ఏఐ విప్లవం నడుస్తున్న నేపథ్యంలో మెటా సంస్థ కంప్యూటర్ పవర్, డేటా సెంటర్‌లపై ఎక్కువ వ్యయం వెచ్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య ఓరియన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్‌ను మెటా మర్కెట్‌లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
1.ఎలాన్ మస్క్ (256 డాలర్లు బిలియన్)
2.జుకర్‌బర్గ్ సంపద (206 బిలియన్ డాలర్లు)
3. జెఫ్ బెజోస్ సంపద (205 బిలియన్ డాలర్లు)
4.బెర్నార్డ్ ఆర్నాల్ట్ (193 బిలియన్ డాలర్లు)
5.లారీ ఎలిసన్ (179 బిలియన్ డాలర్లు)