‘నేను పీహెచ్‌డీ చేస్తున్నాను..దయచేసి నాతో ఎవ్వరూ మాట్లాడకండి’

|

Oct 07, 2022 | 7:37 PM

వాయిదాలను నమ్ముకుంటే నట్టేట్లో మునుగుతానని సత్యం బోధపడిన ఓ పీహెచ్‌డీ స్కాలర్‌ గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా తన థీసిస్‌ పూర్తి చేయాలని శబదం పన్నాడు. అందుకు..

నేను పీహెచ్‌డీ చేస్తున్నాను..దయచేసి నాతో ఎవ్వరూ మాట్లాడకండి
Phd Student Note
Follow us on

పనులు వాయిదా వేయకుండా సకాలంటో పూర్తి చేయాలంటే అనవసరమైన వాటికి దూరంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. మరికొందరేమో ఇంకా చాలా రోజులున్నాయ్‌.. చివరి రోజున చూసుకుందాంలే అని వాయిదా వేస్తుంటారు. ఇలా పనులను వాయిదా వేసే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. పైగా కష్టమైన పనులు చేసేందుకు మనసు కూడా మొరాయిస్తుంటుంది. తర్వాత చూసుకుందాంలే! అని పదేపదే చెబుతుంటుంది. వాయిదాలను నమ్ముకుంటే నట్టేట్లో మునుగుతానని సత్యం బోధపడిన ఓ పీహెచ్‌డీ స్కాలర్‌ గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా తన థీసిస్‌ పూర్తి చేయాలని శబదం పన్నాడు.

అందుకు టైం మేనేజ్‌మెంట్‌ ఓ సవాలైంది సదరు విద్యార్ధికి. తన రీసెర్చ్‌ పూర్తి అయ్యేంత వరకు మధ్యలో ఎవరూ డిస్‌టర్బ్‌ చేయకుండా, ఫోన్లు, మెసేజ్‌లతో విసిగించకుండా ఉండేందుకు వినూత్నంగా ఓ పని చేశాడు. తాను రీసెర్చ్‌ చేస్తున్న క్యాబిన్‌ ముందు పెద్ద పెద్ద అక్షరాలతో ఓ నోట్‌ రాసి అతికించాడు. దానిలో ఏముందంటే..

ఇవి కూడా చదవండి

‘దయచేసి నాతో మాట్లాడకండి. నేను నా పీహెచ్‌డీ వర్క్‌ చేస్తున్నాను. ఒక వేళ మీరు నాతో మాట్లాడితే ఆపకుండా వాగుతూనే ఉంటాను. నేను భయంకరమైన వాయిదాలకోరును. అవకాశం దొరికితే చాలు పనులు వాయిదా వేస్తుంటాను. మరీ అవసరమనుకుంటే ఈ మెయిల్‌ చెయ్యండి’ అని రాశాడు. లీడ్స్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ విద్యార్ధి మాత్రమే కాదు, నాటింగ్‌హామ్ బిజినెస్ స్కూల్‌లో మార్కెటింగ్‌లో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఈ రీసెర్చ్‌ స్టూడెంట్‌ రాసిన నోట్‌ను ఫొటో తీసి స్టీవ్ బింగ్‌హామ్ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్టు చేశాడు. పనులను వాయిదా వేసే అలవాటున్న వాళ్లకు కూడా ఈ పోస్టు ఉపయోగపడుతుందని స్టీవ్‌ బింగ్‌హామ్‌ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. అంతే అది కాస్తా నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్న కామెంట్లు చేస్తున్నారు. అవేంటో మీరే చూడండి..