Corona Virus: కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఐరోపా దేశాలు విలవిలాడుతూనే ఉన్నాయి. గత వారంలో యూరోపిన్ దేశాలలో దాదాపు రెండు మిలియన్ల కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఒకే వారంలో ఇవే అత్యధిక కేసులని చెప్పింది. అంతేకాదు గత వారం ఈ ఖండంలో దాదాపు 27 వేల మరణాలు నమోదయ్యాయని ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం నమోదైన COVID-19 మరణాలలో సగానికి పైగా ఇక్కడే ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పింది. తూర్పు ఐరోపాలో తక్కువ టీకా రేట్లు ఉన్న దేశాలలో మాత్రమే కాకుండా, పశ్చిమ ఐరోపాలో ప్రపంచంలోనే అత్యధిక టీకా రేట్లు ఉన్న ఫ్రాన్స్, బెల్జియం తదితర దేశాల్లోనూ వైరస్ పెరుగుతోందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ చెప్పారు.
ఏ దేశం కూడా మహమ్మారిని కట్టడి చేయడానికి టీకాలతోనే సాధ్యం కాదని టెడ్రోస్ చెప్పారు. అంతేకాదు వ్యాక్సిన్ పూర్తి చేసిన దేశాలకే కాదు.. ఇతర దేశాలకు కూడా ఇదొక హెచ్చరిక అని చెప్పారు. .. మేము ముందు నుంచి చెబుతూనే ఉన్నట్లు కరోనా మహమ్మారిని కేవలం టీకాలతో కట్టడి చేయడం సాధ్యం కాదని.. నివారణకు తగిన నిబంధనలు పాటించాలని టెడ్రోస్ మరోసారి హెచ్చరించారు.
అయితే వ్యాక్సిన్ కరోనా సోకినవారిని మరణం నుంచి రక్షించే అవకాశాలు ఎక్కువని.. అంతేకాదు ఆస్పత్రిలో చేరకుండా చేస్తాయని .. అంతేకాని… టీకాలు కరోనా వ్యాప్తిని మాత్రం నిరోధించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు, వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉన్నవారు ఇంకా తొలి డోసు కోసం ఎదురుచూస్తునే ఉన్నారని.. వారిని వదిలిపెట్టి ఆరోగ్యంగా ఉన్నవారికి బూస్టర్ డోసులు, పిల్లలకు టీకా వేయడంలో అర్థం లేదని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రతిరోజూ, తక్కువ-ఆదాయ దేశాల్లో ప్రాథమిక మోతాదుల కంటే ప్రపంచవ్యాప్తంగా ఆరు రెట్లు ఎక్కువ బూస్టర్‌లు నిర్వహించబడుతున్నాయని ఇది భారీ ” కుంభకోణం”గా టెడ్రోస్ అభివర్ణించారు.
Media briefing on #COVID19 with @DrTedros https://t.co/D0A9dUBXO7
— World Health Organization (WHO) (@WHO) November 12, 2021
Also Read: