Ethereum Co Founder: కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతున్న భారత్‌కు.. భారీ సహాయం ప్రకటించాడు క్రిప్టో బిలియనీర్, ఎథీరియం సహ వ్యవస్థాపకుడు విటాలిన్ బుటెరిన్. ఇప్పటికే ఎవ్వరు ఇవ్వలేనంత భారీ మొత్తంలో.. విరాళం ఇచ్చాడు. భారతదేశ కోవిడ్ రిలీఫ్ కోసం రూ. 7400 కోట్లు విలువ చేసే క్రిప్టో కరెన్సీని విరాళంగా ఇచ్చాడు. బుటెరిన్ ప్రకటించిన భారీ విరాళంకు.. నెటిజన్స్ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
దేశంలోని కరోనా విపత్కర పరిస్థితులను అర్థం చేసుకుని స్పందించినందుకు థ్యాంక్స్ చెబుతున్నారు. బుటెరిన్ ప్రకటించిన భారీ విరాళం ట్వీట్‌ను భారత్ టెక్ వ్యవస్థాపకుడు సందీప్ నెయిల్వాల్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. భారత్‌లో క్రిప్టో కర్సెన్సీ రద్దు కాలేదని, 60 లక్షల డాలర్లు క్రిప్టో కరెన్సీ విరాళాలు అందాయని వివరించారు .
అయితే ఈ క్రిప్టో కరెన్సీ డిజిటల్ కరెన్సీ కిందకే వస్తోంది. ఈ డిజిటల్ కరెన్సీ కేంద్రం లేదా ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల నియంత్రణలో ఉంటుంది. డిజిటల్ కరెన్సీ నిర్వహణ బాధ్యతను ఇవి చూసుకుంటాయి. అయితే ఇక్కడ క్రిప్టోకరెన్సీల విషయానికి వస్తే.. వీటిపై ఎవరి నియంత్రణ ఉండదు. డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. క్రిప్టోకరెన్సీల విలువ డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. బ్లాక్‌చైయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీలు పనిచేస్తాయి.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. పదవీ కాలం పొడిగింపు..
వాట్సాప్‌లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!
డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
Thanks @VitalikButerin
One thing we have learnt from Ethereum and @VitalikButerin is importance of community
We will not do anything which hurts any community specially the retail community involved with $SHIB
We will act responsibly!
Plz dont worry $SHIB holders. https://t.co/M4GxTR0JAn
— Sandeep – Polygon(prev Matic Network) (@sandeepnailwal) May 12, 2021