Couple trying to sell: మనుషుల్లో రోజు రోజుకు మానవత్వం నశించిపోతోంది. కన్న పిల్లల పట్ల ప్రేమ కనుమరుగైపోతోంది. నవమాసాలు మోసి, కనీ, పెంచినా.. ఆ మాతృత్వపు మాధుర్యాన్ని క్షణాల్లో మరిచిపోతున్నారు. అయితే, కుటుంబ పోషణ భారమయ్యో.. ఆడపిల్ల అనే కారణంతోనో తల్లిదండ్రులు తమ తమ పిల్లలను అమ్మకానికి పెట్టిన ఘటనలు కోకొల్లలు. ఇలాంటి అమానుష ఘటనే ఈజిప్టులో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే.. ఈజిప్టులోని కైరోకు చెందిన ఓ జంట తమ బిడ్డను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. తమ పాప ఫోటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఆ దంపతులు.. తమ బిడ్డను అమ్మేయాలనుకుంటున్నామని, అసక్తిగల వారు తమను సంప్రదించవచ్చునంటూ పోస్టు పెట్టారు.
అయితే ఇది కాస్తా వైరల్ అవడం, కైరో సైబర్ క్రైమ్ అధికారుల కంట పడటం చకచకా జరిగిపోయింది. దీనినై తీవ్రంగా స్పందించిన సైబర్ క్రైమ్ అధికారులు.. ఫేస్‌బుక్‌లో బిడ్డను అమ్మకానికి పెట్టిన దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో వారిని విచారించగా.. ఆర్థిక కష్టాల వల్లే తాము తమ బిడ్డను అమ్మకానికి పెట్టినట్లు అధికారుల ముందు వాపోయారు.
Also read: