Ecuador Jail Riots: ఈక్వెడార్‌ జైల్లో అల్లర్లు.. 44 మంది ఖైదీలు మృతి.. 100 మంది జంప్..

|

May 11, 2022 | 6:09 AM

Ecuador Jail Riots: ఈక్వెడార్‌లోని జైలులో జరిగిన అల్లర్లలో 44 మంది మరణించారు. వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకొని పారిపోయారు.

Ecuador Jail Riots: ఈక్వెడార్‌ జైల్లో అల్లర్లు.. 44 మంది ఖైదీలు మృతి.. 100 మంది జంప్..
Prison
Follow us on

Ecuador Jail Riots: ఈక్వెడార్‌లోని జైలులో జరిగిన అల్లర్లలో 44 మంది మరణించారు. వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌లోని శాంటో డొమింగోలో ఉన్న బెల్లావిస్టా జైలులో ఖైదీమ మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి.. కరడుగట్టిన నేరగాళ్లు ఉన్న ఈ జైలులో ఖైదీల ముఠాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి..ఈ హింసాకాండలో 44 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు.. వంద మందికి పైగా గాయపడ్డారు. బెల్లావిస్టా జైలు ప్రాంగణమంతా రక్తసిక్తంగా మారింది. పోలీసులు భద్రతా దళాలు జైలు చుట్టూ మొహరించారు.

బెల్లావిస్టా జైలులో ఒకవైపు జైలులో హింసాకాండ కొనసాగుతుండగా, మరోవైపు ఇదే ఛాన్స్‌గా భావించి ఖైదీలు పారిపోయారు. 220 మంది ఖైదీలు పరారు కాగా వీరిలో 112 మందిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు.. జైలు లోపల ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడటంతో ఖైదీల కుటుంబ సభ్యులు జైలు బయట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాదక ద్రవ్యాల ముఠాలకు కేంద్రంగా ఉన్న బెల్లావిస్టాలో ఓ ముఠా నాయకున్ని కోర్టు ఆదేశాల ప్రకారం మరోజైలుకు తరలించిన తర్వాత ఈ హింస చెలరేగిందని అధికారులు చెబుతున్నారు.. తాజా అల్లర్ల తర్వాత జైలు పరిసరాల్లో భద్రతను మరింతగా పెంచారు.

ఇవి కూడా చదవండి

ఈక్వెడార్‌ జైళ్లలో హింస కొత్తేమీ కాదు. ఖైదీల మధ్య గొడవలు హత్యలకు దారి తీయడం ఇక్కడ సర్వ సాధారణం. గత ఏడాది ఇక్కడి జైళ్లలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 316 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా 35 వేల మంది ఖైదీలు జైళ్లలో మగ్గిపోతున్నారు.. ఈ సంఖ్య ఇక్కడి జైళ్ల కెపాసిటీకన్నా 15 శాతం ఎక్కువ అని అధికారులు చెబుతున్నారు.