Alert: ఎబోలా విస్తరిస్తోంది.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

ఓ వైపు కరోనాతో ప్రపంచమంతా అల్లాడుతుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మరో షాకింగ్ న్యూస్‌ని చెప్పింది. డెమొక్రటిక్‌ రిపబ్లికన్‌ ఆఫ్‌ కాంగోలో ఎబోలా విస్తరిస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి డాక్టర్ మైకేల్ రేయాన్ తెలిపారు. జూన్‌ 1 నాటికే కాంగోలోని ఈక్వేటర్ ప్రాంతంలో ఎబోలా ప్రారంభమైందని.. ఇప్పటివరకు 50 మందికి ఈ వైరస్‌ సోకిందని, వారిలో 20 మంది మరణించినట్లు ఆయన వివరించారు. చాలా వేగంగా ఇది విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తుందని రేయాన్ అన్నారు. ప్రస్తుతం ఈ వైరస్ […]

Alert: ఎబోలా విస్తరిస్తోంది.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక
Follow us

| Edited By:

Updated on: Jul 14, 2020 | 5:40 PM

ఓ వైపు కరోనాతో ప్రపంచమంతా అల్లాడుతుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మరో షాకింగ్ న్యూస్‌ని చెప్పింది. డెమొక్రటిక్‌ రిపబ్లికన్‌ ఆఫ్‌ కాంగోలో ఎబోలా విస్తరిస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి డాక్టర్ మైకేల్ రేయాన్ తెలిపారు. జూన్‌ 1 నాటికే కాంగోలోని ఈక్వేటర్ ప్రాంతంలో ఎబోలా ప్రారంభమైందని.. ఇప్పటివరకు 50 మందికి ఈ వైరస్‌ సోకిందని, వారిలో 20 మంది మరణించినట్లు ఆయన వివరించారు. చాలా వేగంగా ఇది విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తుందని రేయాన్ అన్నారు.

ప్రస్తుతం ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ, కరోనా నేపథ్యంలో ఎబోలాపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రేయాన్ తెలిపారు. ఈ వైరస్‌ని ప్రారంభంలోనే నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అంతేకాదు ఈ వైరస్ గతంలో కంటే ఈసారి తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆయన వివరించారు. ఇప్పటికి కాంగోలో 11,327 మంది ఎబోలా వ్యాక్సిన్ ఇచ్చామని.. కానీ అది తన రూపాన్ని మార్చుకోవడం వలన సులువుగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అధ్యయనంలో తేలిందని రేయాన్ చెప్పుకొచ్చారు.