
ఫిలిపిన్స్‌లో మరోసారి వరుస భూకంపాలు ప్రకంపనలు సృష్టించాయి.కొన్ని నిమిషాల్లొనే మూడు బలమైన భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపాల తీవ్రత వురుసగా 6.9, 7.0, 7.0 గా నమోదైనట్టు అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది.తొలుత ఈ భూకంప కేంద్రం బోహోల్ ప్రావిన్స్‌లోని కాలాపే మున్సిపాలిటీకి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ భూకంప దాటికి బంటాయన్ ప్రాంతంలో ఒక ప్రార్థనా మందిరం కూలినట్టు సోషల్ మీడియాలో వీడయోలు వైరల్‌గా మారాయి. ఈ వైరల్ వీడియోలో ఒక భవనం కూలిపోవడాన్ని మనం చూడవచ్చు.
ఇదిలా ఉండగా ఈ భూకంపం నేపథ్యంలో లేటె,సెబు,బిలిరాన్ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తంగా చేశారు. ఈ ప్రాంతాలు భూకంప కేంద్రానికి సమీపంలో ఉండడంతో పాలు, సముద్ర తీరం వెంబడి ఉండడంతో..సముద్రంలో అలజడులు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Video of the M6.9 earthquake hitting Bantayan, Philippines…😱
📹 Photoholic Island/fb pic.twitter.com/Nm2K2tJ2wz
— Volcaholic 🌋 (@volcaholic1) September 30, 2025
అయితే ఈ వరుప భూకంపాల వలన ఆస్తినష్టం జరిగినట్టు సోషల్ మీడియా దృశ్యాల ద్వారా స్పష్టమవుతున్నా.. ప్రాణనష్టంపై మాత్రం ఇప్పటివరకు ఎలా సమాచారం అందలేదు.అయితే ఎక్కువ శాతం ఫిలిపిన్స్‌లో సంభవించే భూకంపాలు తక్కవ తీవ్రతతో ఏర్పడడంతో ఇక్కడ ప్రజలు తట్టుకోగలుతున్నారు. కానీ కొన్ని సార్లు ఇవి వారికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోపం ఇక్కడ క్లిక్ చేయండి.