అమెరికా ఫ్లోరిడాలో జరుగుతున్న రేస్ వరల్డ్ ఆఫ్‌షోర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఉత్కంఠగా కొనసాగుతోంది. తొలిరోజే ఈ బోట్ రేసింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. రేసింగ్‌లో పాల్గొన్న రెండు బోట్లు ఫల్టీ కొట్టాయి. వేగం అదుపు తప్పడంతో.. రెండు రేసింగ్ బోట్లు ఢీకొట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఆ రెండు బోట్లు పైకి ఎగిరి కింద పడిపోయాయి. ఐతే రెండు పడవల్లోని నలుగురు రేసర్లకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే రెండు బోట్లు క్రాష్ అవడంతో రేసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే ఈ రెండు బోట్లు ఢీకొట్టుకున్న సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.