AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dubai: సైన్స్‌కే సవాల్.. చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం.. మామూలు కథ కాదుగా!

దుబాయ్ ఇప్పుడు ప్రపంచంలోనే ఒక కొత్త అట్రాక్షన్. తనకు తాను నిత్య నూతనంగా మార్చుకుంటూ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది ఈ దేశం. ఇప్పటివరకు టూరిజంలో ది బెస్ట్ కంట్రీ అనిపించుకున్న దుబాయ్.. ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలోకి అడుగు పెట్టింది. అది కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిశోధన. ఇన్నాళ్లు ప్రపంచానికి పెట్రోల్‌ బంక్‌గా ఉన్న దేశం ఇకపై సబ్‌ స్టేషన్‌గా మారనుంది.

Dubai: సైన్స్‌కే సవాల్.. చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం.. మామూలు కథ కాదుగా!
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: May 22, 2025 | 7:34 PM

Share

గల్ఫ్ కంట్రీస్ అంటేనే ప్రపంచానికి ఇంధనం అందించే దేశాలుగా తెలుసు. క్రూడ్ ఆయిల్ సరఫరాలో ప్రపంచ దేశాలకు మెజారిటీ సప్లై ఇక్కడి నుంచి అవుతుంది. క్రూడ్ ఆయిల్ సరఫరా ద్వారా భారీ ఎత్తున సంపాధనను గడించుకున్న ఈ దేశాలు గత కొద్ది సంవత్సరాలుగా ఆయిల్ ధరలు పడిపోవడంతో ఆదాయం కోల్పోతున్నాయి. ఇది ముందే గ్రహించిన దుబాయ్ టూరిజం వైపు అడుగులు వేసి సక్సెస్ అయింది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వ్యాపారంలో ఎలాంటి ఆదాయం లేకపోయినా.. టూరిజం ద్వారా భారీ ఎత్తున ఆర్జిస్తుంది దుబాయ్. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ పై మక్కువ చూపుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడానికి కూడా ఇది ఒక కారణం. ఒక అంచనా ప్రకారం మరో 15 సంవత్సరాలలో 50 శాతానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం చేరుకుంటుంది. ఇన్నాళ్లు కార్లకు పెట్రోల్ డీజిల్ అమ్ముకొని బాగా సంపాదించిన దుబాయ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లకు కరెంటు సరఫరా చేసి మళ్లీ పాత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్ ఎవరూ చేయలేని కొత్త ఆలోచన చేసింది. చంద్రుడు నుంచి భారీ ఎత్తున సోలార్ పవర్‌ను భూమ్మీదికి తీసుకొచ్చే ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసి ప్రాజెక్టును మొదటి దశలో ముందుకు తీసుకెళుతుంది.

ఇది ఏలా పనిచేస్తుంది…

అంతరిక్షంలో చంద్రుడి చేట్టూ పదివేల కిలోమీటర్ల మేర సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారు. రోజులో ఏదో ఒకచోట చంద్రుడిపై సూర్య రష్మి పడుతుంది కాబట్టి నిరంతరం అక్కడ విద్యుత్ సరఫరా అవుతుంది. అయితే సూర్యుడి నుంచి ఈ సోలార్ పవర్ ని భూమి మీదకి తీసుకురావడానికి ఒక ఉపగ్రహాన్ని చంద్రుడి కక్షలోకి ప్రవేశపెడతారు. ఇక దుబాయిలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మహమ్మద్ అల్ రషీద్ సోలార్ పార్క్‌లో ఉన్న రిసీవర్‌కి ఈ ఉపగ్రహం వైర్లెస్ పద్ధతిలో సోలార్ పవర్‌ని పంపిస్తుంది. అక్కడ నుంచి రిటైల్‌గా క్లీన్ సోలార్ పవర్‌ని దుబాయ్ వాడుకుంటుంది.

దీంతో 2030 నాటికి దుబాయ్ దేశానికి మొత్తం 100% చంద్రుని పై నుంచి వచ్చిన సోలార్ పవర్‌ని వినియోగించుకునే దిశగా ముందుకు వెళుతుంది. ప్రతిరోజు 5000 మెగావాట్లు ప్రొడ్యూస్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. ఇక 2070 నాటికి అంచలంచలుగా పవర్ ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్లి ప్రపంచ దేశాల్లో ఎక్కడికక్కడ రిసీవర్లు ఏర్పాటు చేసి.. వారికి కావలసిన విద్యుత్‌ను వైర్లెస్ పద్ధతిలో అందించనుంది. దీని ద్వారా మరో 40 ఏళ్లలో దుబాయ్ వరల్డ్ పవర్ హబ్‌గా మారుతుంది. ఇదే ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవడం అంటే. ప్రపంచానికి పెట్రోల్ బంక్‌గా ఉన్న దుబాయ్ ఇకపై సబ్ స్టేషన్‌గా మారనుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…